Home
Mobile

iPhone Days Sale : ఐఫోన్‌ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. ఫ్లిప్‌కార్ట్‌ ఐఫోన్‌ డేస్ సేల్‌ డీల్స్‌ ఇవిగో..!

Flipkart iPhone Days sale 2025 : మీరు ఎప్పటికైనా కొనుగోలు చేయాలని భావిస్తున్న ఫోన్‌ ఏంటి అంటే... చాలా మంది ఐఫోన్‌ అని చెబుతుంటారు. ఐఫోన్‌ అంటే అంత క్రేజ్‌ మరి. అయితే ధరలు ఎక్కువగా ఉండడం కారణంగా చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. అయితే సేల్‌ సమయాల్లో డిస్కౌంట్‌ ధరకు ఐఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఇవాళ్టి నుంచి ఐఫోన్‌ డేస్‌ సేల్‌ ప్రారంభం అయింది. ఈ సేల్‌ మే 15 వరకు అందుబాటులో ఉంటుంది.

ఐఫోన్ 13 నుంచి ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ వరకు :
ఫ్లి్ప్‌కార్ట్‌ ఐఫోన్‌ సేల్‌ డేస్‌ 2025 లో భాగంగా ఐఫోన్ 13 నుంచి ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ మోడల్స్‌ పై డిస్కౌంట్‌లను పొందవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ కూడా అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. నో కాస్ట్‌ EMI ఆప్షన్‌తోపాటు ఎక్స్చేంజీ వంటి ఆప్షన్‌లను ఉపయోగించుకోవచ్చు.

Flipkart iPhone Days sale 2025

ఐఫోన్ 13, ఐఫోన్ 14 :
ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ 13 మోడల్‌ను రూ.40999 కే కొనుగోలు చేసుకోవచ్చు. అదే ఐఫోన్‌ 14 ను రూ.54999 కే సొంతం చేసుకోవచ్చు. అదే ఐఫోన్‌ 15 మరియ ఐఫోన్ 15 ప్లస్‌ మోడల్స్‌ను కూడా డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌ :
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ 15 ప్రస్తుత ధర రూ.63999 గా ఉంది. ఈ సేల్‌లో భాగంగా బ్యాంకు ఆఫర్లు, ఇతర డీల్స్‌తో రూ.60999 కే సొంతం చేసుకోవచ్చు. అదే ఐఫోన్‌ 15 ప్లస్‌ మోడల్‌ ధర రూ.73999 గా ఉండగా.. ఈ సేల్‌లో భాగంగా రూ.70999 కే సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌ :
ఫ్లిప్‌కార్ట్‌ ఐఫోన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా ఐఫోన్‌ 16 మోడల్‌ను రూ.68,999 కే కొనుగోలు చేయవచ్చు. అదే ఐఫోన్‌ 16 ప్లస్‌ వేరియంట్‌ ను రూ.78,999 గా ఉంది. బ్యాంకు ఆఫర్లు సహా ఇతర డీల్స్‌తో ఈ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్‌ 6.1 అంగుళాల సూపర్‌ రెటీనా XDR OLED డిస్‌ప్లను కలిగి ఉంది. సిరామిక్‌ షీల్డ్‌ రక్షణను పొందుతుంది.

ఐఫోన్ 16 హ్యాండ్‌సెట్ 3nm ఆక్టాకోర్‌ A18 చిప్‌సెట్‌, iOS 18 పైన పనిచేస్తోంది. ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. కెమెరా కంట్రోల్ బటన్‌, యాక్షన్‌ బటన్‌, డైనమిక్‌ ఐలాండ్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్‌ కెమెరాతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 12MP కెమెరాను కలిగి ఉంది.

ఐఫోన్ 16 ప్రో :
ఐఫోన్‌ 16 ప్రో మోడల్స్‌ ను కూడా డిస్కౌంట్‌ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ 256GB వేరియంట్‌ రూ.1,29,900 విడుదల అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.122900 గా ఉంది. ఈ సేల్‌లో భాగంగా బ్యాంకు కార్డులతో రూ.1,19,900 గా ఉంది.

ఐఫోన్‌ 16 ప్రో మోడల్‌ 6.3 అంగుళాల సూపర్‌ రెటీనా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే సిరామిక్‌ షీల్డ్ రక్షణను పొందుతుంది. ఈ ఫోన్‌ 3nm A18 ప్రో చిప్‌సెట్‌ పైన పనిచేస్తోంది. ఈ ఫోన్‌ 48MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 12MP టెలిఫోటో కెమెరాతోపాటు 12MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.

ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ :
ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ 2556GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.144900 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ ఐఫోన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా రూ.1,32,900 గా ఉంది. బ్యాంకు కార్డులతో ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.129900 కే సొంతం చేసుకోవచ్చు.

త్వరలో భారత్‌ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సిరీస్‌ విడుదల కానుంది. ఇందులో ఐఫోన్‌ 17, ఐఫోన్ 16 ఎయిర్‌, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌ విడుదల కానున్నాయని తెలుస్తోంది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో అందుబాటులోకి రానున్నాయని సమాచారం. ఐఫోన్‌ 17 ఎయిర్‌ ఫోన్‌ ప్రత్యేక డిజైన్‌ను కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart iPhone Days sale 2025 offers best deals iphone models here is the list
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X