Home
Mobile

ఫ్లిప్‌కార్ట్ ద్వారా ‘మోటో జీ’ విడుదల

మోటరోలా మధ్య ముగింపు ఫోన్ ‘మోటో జీ' ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఫిబవ్రరి 5న ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించబోతోంది. ఔత్సాహికులు ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేక ఆఫర్ల పై కొనుగోలు చేయవచ్చు. మోటో జీ విడుదలకు సంబంధించిన వివరాలను ఫ్లిప్‌కార్ట్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

ఇండియన్ మార్కెట్లో మోటో‌జీ స్మార్ట్‌ఫోన్ విడుదలకు సంబంధించి తాము అధికారిక ఆవిష్కరణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఫోన్ ధరకు సంబంధించి వివరాలను సదరు వెబ్‌సైట్ వెల్లడించలేదు.

ఫ్లిప్‌కార్ట్  ద్వారా ‘మోటో జీ’ విడుదల

‘మోటో జీ' ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: 4.5 అంగుళాల డిస్‌ప్లే (720 పిక్సల్ రిసల్యూషన్, 329 పీపీఐ), ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, స్నాప్‌డ్రాగెన్ 400 ఎస్ఓసీ విత్ 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 720 పిక్సల్ వీడియో రికార్డింగ్, ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (8జీబి, 16జీబి). 4జీ, ఎల్టీఈ కనెక్టువిటీ ఫీచర్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వై-ఫై ఫీచర్‌ను పొందుపరిచారు. 7 కలర్ చేంజబుల్ బ్యాక్ కవర్స్, వాటర్ రిపెల్లంట్ కోటింగ్. 2070 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. 64జీబి క్లౌడ్ స్టోరేజ్, శక్తివంతమైన బేసిక్ ఫీచర్లు: మోటో జీ రూపకల్పనలో భాగంగా కంపెనీ సాఫ్ట్‌వేర్ బృందం అత్యధిక సమయాన్ని సాఫ్ట్‌వేర్ బేసిక్ ఫీచర్లను శక్తివంతంగా తీర్చిదిద్దేందుకే కేటాయించింది. మోటో జీ గెలాక్సీ ఎస్4తో పోలిస్తే వేగవంతంగా బూట్ కాగలదని మోటరోలా సాఫ్ట్‌వేర్ బృందం అంటోంది.

మోటరోలా మైగ్రేట్: మోటో జీ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన సరికొత్త ‘మైగ్రేట్ అప్లికేషన్' మీ పాత ఫోన్‌లోని ముఖ్యమైన డేటాను కొత్త ఫోన్‌లోకి వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేసేందుకు దోహదపడుతుంది.

శక్తివంతమైన ఇమేజింగ్ అప్లికేషన్ మోటరోలా తమ సరికొత్త మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన ఇమేజింగ్ అప్లికేషన్‌ను దోహదం చేసింది. ఈ కెమెరా అప్లికేషన్ ద్వారా మరింత సౌకర్యవంతమైన ఫోటోగ్రఫీని వినియోగదారుదు ఆశించవచ్చు.

అదనపు డ్రైవ్ స్టోరేజ్: మోటో జీ వినియోగదారులు 50జీబి అదనపు స్టోరేజ్‌ను గూగుల్ డ్రైవ్ ద్వారా పొందవచ్చు. మోటో జీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసిన ఎఫ్ఎమ్ అప్లికేషన్ ద్వారా ఇష్టమైన లోకల్ రేడియో స్టేషన్‌లను ట్యూన్ చేసుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X