‘మోటో జీ’ కోసం ఎదురుచూడాల్సిందే!

|

16జీబి ఇంటర్నల్ మెమెరీ సామర్థ్యంతో లభ్యమవుతున్న ‘మోటో జీ' స్మార్ట్‌‍ఫోన్‌ను ఈ సీజన్‌లో సొంతం చేసుకోవాలనుకంటున్నారా..? అయితే, కొద్ది రోజులు ఎదురుచూడక తప్పదు. మెటరోలా మోటో జో స్మార్ట్‌ఫోన్‌లకు హిట్‌ టాక్ లభించటంతో ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తున్న ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌కు కొనుగోలుదారుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే 20,000 మోటో జీ యూనిట్‌లను ఫ్లిప్‌కార్ట్ విక్రయించగలిగిందంటే డిమాండ్ ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 
‘మోటో జీ’ కోసం ఎదురుచూడాల్సిందే!

మోటో జీ 16జీబి వర్షన్ స్మార్ట్‌‍ఫోన్ విక్రయాల జోరు అనూహ్య రీతిలో పంజుకున్న నేపధ్యంలో ఫ్లిప్‌కార్ట్ ‘అవుట్ ఆఫ్ స్టాక్' బోర్డులను పెట్టాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. ఈ క్రమంలో 16జీబి మోడల్ విక్రయాలకు సంబంధించి "Reserve Now" బటన్‌ను వెబ్‌సైట్ జత చేసింది. అంటే, మోటో జీ 16జీబి వర్షన్ స్మార్ట్‌‍ఫోన్‌ను ఈ సీజన్‌లో బుక్ చేసిన వారికి 10 నుంచి 20 రోజల వ్యవధిలో డెలివరీ ఉంటుంది. మార్కెట్లో మోటో జీ 8జీబి వర్షన్ ధర రూ.12,499 కాగా 16జీబి మోటో జీ వర్షన్ ధర రూ.13,999.

మోటో జీ కీలక స్పెసిఫికేషన్‌లు:

4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్, 329 పీపీఐ పిక్సల్ డెన్సిటీ),
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (8జీబి, 16జీబి),
5 మెగతా పిక్సల్ రేర్ కమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్,
2070ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టంకు అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం).
నీటి తాకిడికి గురైనా దెబ్బతినకుండా విధంగా మోటో జీని కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో రూపొందించారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X