ఫ్లిప్‌కార్ట్ మెగా జూన్ బోనంజా సేల్ 2024.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు.. సేల్ పూర్తి వివరాలు..!
ఫ్లిప్‌కార్ట్ మరో ప్రత్యేక సేల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్ మెగా జూన్ బోనంజా సేల్ 2024 (Flipkart Mega June Bonanza Sale 2024) పేరుతో ఇవాళ్టి నుంచి సేల్ ప్రారంభం అయింది. ఈనెల 19 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఏసీలు, స్మార్ట్‌వాచ్‌లు సహా ఇతర గృహోపకరణాలను తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో భాగంగా డిస్కౌంట్‌లు సహా బ్యాంకు ఆఫర్లు కూడా ఉండనున్నాయి.
ఈ ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్‌లో భాగంగా ఆపిల్, శాంసంగ్, గూగుల్, మోటోరోలా, షియోమీ, ఒప్పో, వివో, పోకో, రియల్‌మి, రెడ్‌మి, ఇన్ఫినిక్స్ సహా మరిన్ని బ్రాండ్‌ల హ్యాండ్‌సెట్‌లపై డిస్కౌంట్‌లను పొందవచ్చు. దీంతోపాటు ఐఫోన్ 15 సహా మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో, మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్, వివో T3x 5G వంటి హ్యాండ్‌సెట్‌లను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్ 15 : విడుదల సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.79,900 గా ఉంది. ఈ ఫ్లిప్‌కార్ట్ మెగా జూన్ బోనంజా సేల్‌లో భాగంగా రూ.63,999 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు కార్డుల ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. A16 బయోనిక్ చిప్‌పైన పనిచేస్తుంది.
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో : ఈ హ్యాండ్‌సెట్ విడుదల సమయంలో ధర రూ.36999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్‌లో భాగంగా రూ.29,999 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు HDFC క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చు.
ఈ మోటోరోలా హ్యాండ్‌సెట్ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 50MP+13MP+10MP కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50MP కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. 4500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ : ఈ హ్యాండ్‌సెట్ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్ డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్‌పైన పనిచేస్తోంది. 5000mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరా, 13MP సెకండరీ కెమెరాల సహా సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను కలిగి ఉంది.
ఈ మోటోరోలా హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.22999 గా ఉంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.20,999 కే సొంతం చేసుకోవచ్చు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఈ ఆఫర్ అందుబాటులోకి వస్తుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








