Flipkart లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు.! దేనిపై ఎంత ధర తగ్గిందో చూడండి 

By Maheswara
|

ఐఫోన్ 12 మినీ, పోకో M3, మోటో G60 మరియు ఇన్‌ఫినిక్స్ హాట్ 10 ఎస్ వంటి స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్లు మరియు డిస్కౌంట్‌లను అందించడానికి ఫ్లిప్‌కార్ట్ తన మొబైల్స్ బొనాంజా విక్రయాన్ని గురువారం ప్రారంభించింది. ఈ సేల్ ఆగస్టు 23 వరకు కొనసాగుతుంది. ఈ ఐదు రోజుల ఫ్లిప్‌కార్ట్ సేల్ ఐఫోన్ 12, రియల్‌మే సి 20 మరియు ఒప్పో ఎఫ్ 19 వంటి మోడళ్లపై ప్రీపెయిడ్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ HDFC బ్యాంక్‌తో భాగస్వామ్యమై ఎంపిక చేసిన ఫోన్‌లపై తక్షణ డిస్కౌంట్లను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ సేల్ మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని ప్రముఖ ఫోన్‌లలో నో-కాస్ట్ EMI ఎంపికలు మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా అందిస్తుంది.

Flipkart మొబైల్స్ బొనాంజా సేల్ డిస్కౌంట్‌లు

Flipkart మొబైల్స్ బొనాంజా సేల్ డిస్కౌంట్‌లు

ఫ్లిప్కార్ట్ మైక్రోసైట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్ లో ఐఫోన్ 12 మినీ ధర రూ. 69,900 నుండి రూ. 59,999 మరియు ₹ 63,999 కి తగ్గింది మెమరీ వేరియంట్ ను బట్టి ధరతగ్గింది. IPhone SE (2020) కూడా రూ. 39,900 నుండి ధర రూ. 34,999 కు తగ్గి సేల్ లో అందుబాటులో ఉంది. ఇంకా, iPhone XR ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో  రూ. 47,900 నుండి రూ. 41,999 కి ధర తగ్గింది.

అన్ని బ్రాండ్ల ఫోన్లపై

అన్ని బ్రాండ్ల ఫోన్లపై

మీరు వెతుకుతున్నది ఐఫోన్ కాక,వేరొక ఫోన్ అయితే వాటి పై కూడా ఆఫర్లు చూద్దాం రండి. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో Moto G60 ధర రూ.17,999 నుండి రూ. 16,999 కి ఇది తగ్గింది. Infinix Hot 10S కూడా రూ.9,999 నుండి ధర రూ. 9,499. కి తగ్గింది.

ఫ్లిప్‌కార్ట్ సేల్ లో పోకో M3 ప్రారంభ ధర కూడా రూ. 10,999 నుంచి రూ.10,499, కి తగ్గింది. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5 స్మార్ట్ ఫోన్ ₹7,199 నుండి రూ. 6,999.కి ధర తగ్గింది.

మొబైల్ గేమర్స్ కోసం ఆసుస్ ROG ఫోన్ 3  పై కూడా డిస్కౌంట్ లభిస్తోంది  ఈ ఫోన్  రూ. 46,999 నుండి  రూ. 39,999 కి తగ్గింది. ఇక ఈ సేల్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ F41 కూడా  ₹ 15,499 నుండి రూ. 14,499,కు తగ్గి అమ్ముడౌతున్నది.

Flipkart మొబైల్స్ బొనాంజా సేల్ ఆఫర్లు

Flipkart మొబైల్స్ బొనాంజా సేల్ ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్ లో ఐఫోన్ 12 , రియల్‌మి సి 20 , మరియు ఒప్పో ఎఫ్ 19 వంటి మోడళ్లపై ప్రీపెయిడ్ డిస్కౌంట్లను కలిగి ఉంది. ప్రీపెయిడ్ చెల్లింపు పద్ధతిని ఉపయోగించి మీరు ఈ డిస్కౌంట్‌లను పొందవచ్చు. అదనంగా, రూ.5,000 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు ఉన్నాయి. వివో X60, వివో X60 ప్రో, వివో X60 ప్రో+, వివో V21 5G, వివో Y72 5G మరియు వివో Y20G వంటి వివిధ వివో ఫోన్ మోడళ్లపై కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి. ఇంకా, HDFC బ్యాంక్ EMI లావాదేవీలను ఉపయోగించి ఫోన్‌లను కొనుగోలు చేయడంపై కస్టమర్‌లు ఐదు శాతం తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్ వివిధ బ్యాంకులలో నో-కాస్ట్ EMI ఎంపికలను కూడా అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Flipkart Mobiles Bonanza Sale Huge Discounts On Smartphones .Check Offers List Here

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X