Home
Mobile

24 గంటల్లో లక్ష మోటో ఇ4 ప్లస్ యూనిట్లు సేల్

5000mAh బ్యాటరీ, 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్, 13 మెగా పిక్సల్ కెమెరా...

By Sivanjaneyulu Bommu

లెనోవో, మోటోరోలా కాంభినేషన్‌లో జూలై 12న ఇండియాలో విడుదలైన మోటో ఇ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. బ్యాటరీ సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్ అయిన మోటో ఇ4 ప్లస్‌ను మొదటి 24 గంటల్లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా లక్ష మంది కొనుగోలు చేసినట్లు మోటరోలా తెలిపింది.

నిమిషానికి 580 యూనిట్లు...

నిమిషానికి 580 యూనిట్లు...

సేల్ ప్రారంభమై తొలి 60 నిమిషాలు ముగిసేటప్పటికి నిమిషానికి 580 యూనిట్లు చొప్పున అమ్ముడయ్యాయని, ఈ ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు 1.5 లక్షల మంది యూజర్లు ప్రొడక్ట్ పేజీలోకి విజిట్ చేసారని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

రూ.8,999, రూ.9,999 ధర ట్యాగ్‌లతో...

రూ.8,999, రూ.9,999 ధర ట్యాగ్‌లతో...

గురువారం అధికారికంగా మార్కెట్లో లాంచ్ అయిన మెటో ఇ4, మోటో ఇ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు రూ.8,999, రూ.9,999 ధర ట్యాగ్‌లతో విక్రయించబడుతోన్న విషయం తెలిసిందే.

వాటికి అప్‌డేటెడ్ మోడల్స్...

వాటికి అప్‌డేటెడ్ మోడల్స్...

గతేడాది మార్కెట్లో లాంచ్ అయిన మోటో ఇ3, మోటో ఇ3 పవర్ స్మార్ట్‌ఫోన్‌లకు ఈ న్యూ వర్షన్ ఫోన్‌లు అప్‌డేటెడ్ వర్షన్స్. మోటో ఇ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తుండగా, మోటో ఇ4 మోడల్‌ను ఆఫ్‌లైన్ రిటైలర్లు విక్రయిస్తున్నాయి.

మెటల్ బాడీ, వాటర్ రిపెల్లెంట్ నానో కోటింగ్‌తో మోటో ఇ4 ప్లస్

మెటల్ బాడీ, వాటర్ రిపెల్లెంట్ నానో కోటింగ్‌తో మోటో ఇ4 ప్లస్

మెటల్ బాడీతో వస్తోన్న మోటో ఇ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ వాటర్ రిపెల్లెంట్ నానో కోటింగ్‌ను కలిగి ఉంటుంది. దీంతో ఫోన్ చిన్నచిన్న నీటి ప్రమాదాలను తట్టుకోగలదు. ఫోన్ రేర్ కెమెరా భాగం సర్క్యులర్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. మోటరోలా బ్యాట్‌వింగ్‌లోగా అలానే స్పీకర్ గ్రిల్ ఫోన్ వెనుక భాగంలో ఉన్నాయి. ఫోన్ హోమ్‌బటన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను నిక్షిప్తం చేసారు. మార్కెట్లో మోటో ఇ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 3జీబి ర్యామ్/32జీబి స్టోరేజ్ వేరియంట్‌లో దొరుకుతోంది.

స్పెసిఫికేషన్స్...

స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రారయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ MTK6737M సాక్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (f/2.0 aperture, ఆటో ఫోకస్, సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (f/2.2 aperture, ఫిక్సుడ్ ఫోకస్, సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్, బ్యూటిఫికేషన్ మోడ్), 5000mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ స్కానర్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ VoLTE, వై-ఫై, బ్లుటూత్, మైక్రో యూఎస్బీ పోర్ట్, జీపీఎస్, బ్లుటూత్ వీ4.1), సెన్సార్స్ (యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మ్యాగ్నెటో మీటర్, ప్రాక్సిమిటి సెన్సార్), ఫోన్ బరువు 181 గ్రాములు, చుట్టుకొలత 155x77.5x9.55మిల్లీ మీటర్లు.

లాంచ్ ఆఫర్స్ ఇవే..

లాంచ్ ఆఫర్స్ ఇవే..

ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే యూజర్లకు రూ.1599 ఖరీదు చేసే మోటో పల్స్ 2 హెడ్ ఫోన్ రూ.749కే లభిస్తుంది. అంతేకాకుండా రెండు నెలల హాట్ స్టార్ ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఐడియా యూజర్లకు 84జీబి డేటా రూ.443కే లభిస్తుంది. జియో యూజర్లకు జియో ప్రైమ్ + 30జీబి అదనపు డేటాను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. లాంచ్ డే ఆఫర్ క్రింద ఈ ఫోన్ పై రూ.9,000 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. బుయ్‌బ్యాక్ గ్యారంటీ క్రింద రూ.4,000 వరకు లభిస్తుంది.

ఆఫ్‌‌లైన్ మార్కెట్‌కు పరిమితం కానున్న  మోటో ఇ4 స్పెసిఫికేషన్స్...

ఆఫ్‌‌లైన్ మార్కెట్‌కు పరిమితం కానున్న మోటో ఇ4 స్పెసిఫికేషన్స్...

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ MTK6737M సాక్ర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, సింగిల్ సిమ్ స్లాట్ (నానో), 2800mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, కనెక్టువిటీ ఫీచర్స్ (4జీ వోల్ట్, బ్లుటూత్ 4.1ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్).

Best Mobiles in India

English summary
Flipkart sells over 1 lakh Moto E4 Plus units in the first 24 hours. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X