Home
Mobile

ధర రూ.14,230 కే 108MP కెమెరా, 128GB స్టోరేజీ, 5000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్‌.. సేల్ వివరాలు..!

రెడ్‌మి నోట్‌ 13 5G స్మార్ట్‌ఫోన్‌ ధర తగ్గింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) రూ.15,000 కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఎటువంటి బ్యాంకు ఆఫర్లతో సంబంధం లేకుండానే ఈ ధరకు బేస్‌ వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ షాపింగ్ ఉత్సవ్‌ 2024 సేల్‌ నడుస్తోంది. ఫలితంగా బ్యాంకు ఆఫర్ల ద్వారా మరింత తగ్గింపు ధరను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ (Redmi Note 13 5G Smartphone) 108MP కెమెరా సహా 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మి నోట్‌ 13 5G స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్‌ (Arctic White) ధర రూ.14,230 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు కార్డుల ద్వారా 5 శాతం తగ్గింపును పొందవచ్చు. అదే క్రోమాటిక్‌ పర్పుల్‌ వేరియంట్ ధర రూ.14,896 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ (Stealth Black) ధర రూ.16,198 గా ఉంది.

Redmi Note 13 5G smartphone

రెడ్‌మి నోట్‌ 13 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ (Arctic White) ధర రూ.16,795 గా ఉంది. ఇదే కలర్‌ వేరియంట్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,380 గా ఉంది. అదే ప్రిజమ్‌ గోల్డ్‌ కలర్‌ వేరియంట్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16987 గా ఉంది. యాక్సెస్‌ బ్యాంకు కాల్డుల ద్వారా 5 శాతం తగ్గింపును పొందవచ్చు.

రెడ్‌మి నోట్ 13 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ డిస్‌ప్లే 1000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 CPU ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత OS ను కలిగి ఉంటుంది.

కెమెరా విభాగం పరంగా వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉన్నాయి. 108MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను అమర్చారు. ఈ హ్యాండ్‌సెట్ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ 2024 సదస్సులో రెడ్‌మి A4 5G స్మార్ట్‌ఫోన్‌ ను సంస్థ ఆవిష్కరించింది. స్నాప్‌డ్రాగన్‌ 4s జెన్‌ 2 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలిపింది. దీంతోపాటు రూ.10,000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. ఎంట్రీ లెవల్‌ ధర సెగ్మెంట్‌లో ఈ చిప్‌సెట్‌తో అందుబాటులోకి రానున్న హ్యాండ్‌సెట్‌ ఇదేనని సంస్థ తెలిపింది. ఈ సంవత్సరం చివర్లో భారత్‌ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

చిప్‌సెట్ మినహా హ్యండ్‌సెట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లపై సంస్థ ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. అయితే భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు ఈ స్నాప్‌డ్రాగన్‌ 4s జెన్‌ 2 చిప్‌సెట్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో పుల్‌ HD+ డిస్‌ప్లేను సపోర్టు చేస్తుంది. అలాగే కెమెరాలు కూడా ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (EIS) ఫీచర్‌ను సపోర్టు చేయనున్నాయని తెలుస్తోంది. ప్రదర్శన ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ వృత్తాకర కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది.

దీంతోపాటు స్నాప్‌డ్రాగన్‌ 4s జెన్‌ 2 ప్రాసెసర్‌ బ్లూటూత్‌ 5.1, డ్యూయల్‌ బ్యాండ్ వైఫై 5, NFC వంటి కనెక్టివిటీ ఫీచర్‌లను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. మరియు డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS మరియు NavIC శాటిలైట్‌ సిస్టమ్స్‌ను సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart offers best deal on Redmi Note 13 5G smartphone features sale full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X