Home
Mobile

ధర రూ.7199 కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 128GB స్టోరేజీ ఫోన్‌.. పూర్తి వివరాలు..!

ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌ ధరను తగ్గింపు ధరకు అందిస్తోంది. అక్టోబర్ 31 వరకు దీపావళీ సేల్‌లో భాగంగా అనేక బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లను అందించింది. అయితే దీపావళి అనంతరం కూడా స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లు కొనుసాగుతున్నాయి. ప్రస్తుతం రెడ్‌మి 13c స్మార్ట్‌ఫోన్‌ను (Redmi 13C Smartphone) భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ధర, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.

రెడ్‌మి 13c ధర, సేల్‌ వివరాలు :
ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మి 13c హ్యాండ్‌సెట్ ప్రస్తుతం రెండు వేరియంట్‌లో లభిస్తుంది 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌లో ఉంది. ప్రస్తుతం 4GB ర్యామ్ వేరియంట్‌ను కేవలం రూ.7,199 కే కొనుగోలు చేయవచ్చు. అదే 6GB ర్యామ్ వేరియంట్‌ ధర రూ.8,499 గా ఉంది.

redmi 13c Smartphone

ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం తగ్గింపును పొందవచ్చు. ఈ రెడ్‌మి 13C స్మార్ట్‌ఫోన్ (Redmi 13c 4G smartphone Flipkart sale) ఫ్లిప్‌కార్ట్‌లో మూడు రంగుల్లో లభిస్తుంది. స్టార్‌డస్ట్ బ్లాక్‌, స్టార్‌ప్రాస్ట్‌ వైట్‌, స్టార్‌షైన్‌ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.

రెడ్‌మి 13c స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
రెడ్‌మి 13c స్మార్ట్‌ఫోన్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6,74 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1600*720 పిక్సల్స్‌ రీఫ్రెష్‌ రేట్‌, 600 నిట్స్‌ గరిష్ఠ డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్‌ రక్షణను కలిగి ఉంది.

రెడ్‌మి 13C స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ హీలియో G85 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. గరిష్టంగా 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేయబడింది. మైక్రో SD కార్డుతో స్టోరేజీని పెంచుకొనేందుకు వీలుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14 OS తో పనిచేస్తోంది. 2 ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు మరియు 3 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుంది.

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP మ్యాక్రో లెన్స్, 2MP మరో కెమెరాలతో అందుబాటులో ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్‌ ముందువైపు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. వెనుకవైపు ఫ్లాష్ లైట్‌ను కలిగి ఉంటుంది. 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh ‌బ్యాటరీతో పనిచేస్తుంది.

కనెక్టివిటీ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ 4G VoLTE, వైఫై 802, బ్లూటూత్‌ 5.3, GPS, GLONASS, USB-C ఛార్జింగ్ పోర్టులను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 5G వేరియంట్‌ కూడా అందుబాటులో ఉంది. 5G హ్యాండ్‌సెట్ మూడు వేరియంట్‌లో అందుబాటులో ఉంది. మరియు మూడు కలర్ వేరియంట్‌లో లభిస్తుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart offers best price deal on redmi 13c Smartphone specifications features and sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X