Home
Mobile

32MP టెలిఫోటో కెమెరా, 8GB ర్యామ్‌ Oppo స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్‌.. రూ.2999 తగ్గింపు సహా..!!

ఒప్పో నుంచి ఈ సంవత్సరం జనవరిలో ఒప్పో రెనో 11 సిరీస్‌ (Oppo Reno 11 Smartphone) లాంచ్‌ అయింది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌లు ప్రధానంగా కెమెరా విభాగంపై ఎక్కువ దృష్టిపెట్టాయి. తాజాగా ఒప్పో రెనో 11 స్మార్ట్‌ఫోన్‌ను తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇందులో బ్యాంకు, ఎక్స్చేంజీ ఆఫర్లు కూడా ఉన్నాయి.

మిడ్‌ రేంజ్‌లో మెరుగైన డిజైన్, కెమెరా స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్నట్లయితే ఒప్పో రెనో 11 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ను ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు (Flipkart Smartphone Offers 2024) చేస్తే గరిష్ఠంగా రూ.2999 డిస్కౌంట్‌ సహా ఎక్స్చేంజీ ద్వారా మరో రూ.2999 తగ్గింపును పొందవచ్చు.

Oppo reno 11 smartphone discounts

ఒప్పో రెనో 11 ధర వివరాలు
ఒప్పో రెనో 11 స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది. అదే 8GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.29,999 గా ఉంది.

ఒప్పో రెనో 11 ఫోన్‌ 129GB స్టోరేజీ వేరియంట్‌ను SBI, HDFC, ICICI బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,799 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన మోడళ్లను ఎక్స్చంజీ చేయడం ద్వారా రూ.2799 అదనపు తగ్గింపును పొందవచ్చు.

Oppo reno 11 smartphone discounts

అదే విధంగా 256GB స్టోరేజీ వేరియంట్‌ను బ్యాంకు కార్డులతో కొనుగోలు చేయడం ద్వారా రూ.2,999 తగ్గింపును పొందవచ్చు. మరియు ఎక్స్చేంజీ బోనస్‌ కింద రూ.2999 అదనపు తగ్గింపు వర్తిస్తుంది. పాత మోడళ్లను ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.23,399 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ను వేవ్‌ గ్రీన్ మరియు రాక్‌ గ్రే రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

ఒప్పో రెనో 11 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు..
ఒప్పో రెనో 11 స్మార్ట్‌ఫోన్‌ 1080*2412 పిక్సల్‌ రిజల్యూషన్‌తో 6.7 అంగుళాల పుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంది. హ్యండ్‌సెట్‌ 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

Oppo reno 11 smartphone discounts

ఒప్పో రెనో 11 హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ColorOS 14 పైన పనిచేస్తుంది. మూడు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్లు, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లు పొందనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 8GB ర్యామ్‌ మరియు 128GB, 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది.

32MP సెల్ఫీ కెమెరా, 32MP టెలిఫోటో కెమెరా :
ఈ ఒప్పో రెనో 11 హ్యాండ్‌ సెట్‌ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. f/1.8 అపేచర్‌తో 50MP ప్రధాన కెమెరా, f/2.2 అపేచర్‌తో 8MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, f/2.0 అపేచర్‌తో 32MP టెలిఫోటో కెమెరాని కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Flipkart offers huge discount on Oppo reno 11 smartphone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X