రూ.49,999 ధరకు విడుదల అయిన ఫోన్‌ను రూ.37999 కే కొనుగోలు చేయవచ్చు.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్,,!
భారత్ మార్కెట్ లోకి గత సంవత్సరం నథింగ్ ఫోన్ 2 స్మార్ట్‌ఫోన్ (Nothing Phone 2 martphone Pricedrop) విడుదల అయింది. ఈ హ్యండ్‌సెట్ రెండు 50MP కెమెరాలను కలిగి ఉంది. మరియు 6.7 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ను ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) భారీ డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందని నథింగ్ వెల్లడించింది.
నథింగ్ ఫోన్ 2 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం మూడు స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తుంది. విడుదల సమయంలో 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.44,999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.36999 గా ఉంది. అంటే సుమారు రూ.8000 తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు.

విడుదల సమయంలో 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.49,999 గా ఉండేది. ప్రస్తుతం రూ.37,999 కే కొనుగోలు చేయవచ్చు. అదే విధంగా 512GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.54,999 ధరకి విడుదల కాగా.. ప్రస్తుతం రూ.38,999 కే అందుబాటులో ఉంది. డార్క్ గ్రే, వైట్ రంగుల్లో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు కార్డుల ద్వారా 5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.
నథింగ్ ఫోన్ 2 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
నథింగ్ ఫోన్ 2 స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ LTPO OLED డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 1080*2412 పిక్సల్స్, 1600 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR10+, SGS లో బ్లూ లైట్ ఫీచర్‌ను కలిగి ఉంది. కార్నింగ్ గొరెల్లా గ్లాస్ రక్షణను పొందుతుంది.
ఈ ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. Adreno 730 GPU చిప్‌సెట్‌తో జతచేసి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత OS పై పనిచేస్తుంది. ఈ ఫోన్ 3 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందని నథింగ్ తెలిపింది.
ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ IMX890 ప్రైమరీ కెమెరా, 50MP శాంసంగ్ JN1 కెమెరాలను కలిగి ఉంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాలను అమర్చి ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 45W ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో 4700mAh బ్యాటరీతో పనిచేస్తుంది. వైర్ ఛార్జర్‌తో కేవలం 55 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చు. ఈ ఫోన్ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది. బ్లూటూత్ 5.3, వైఫై 6, 5G సహా అనేక కనెక్టివిటీ ఫీచర్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








