Home
Mobile

ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌తో రూ.20,000 కంటే తక్కువ ధరకే ఈ 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు..!

రియల్‌మి నుంచి భారత్‌ మార్కెట్‌లోకి సెప్టెంబర్‌ నెలలో రియల్‌మి 13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ అయ్యాయి. ఈ సిరీస్‌లో భాగంగా రియల్‌మి 13, రియల్‌మి 13 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేక సేల్‌లో భాగంగా ప్రస్తుతం ఈ ప్లస్‌ మోడల్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. మూడు కలర్‌ వేరియంట్‌లో లభిస్తుంది. 50MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.

రియల్‌మి 13+ 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. విడుదల సమయంలో ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ.22999 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో అన్ని బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు కార్డులపై 5 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది.

realme 13 plus 5g Smartphone price drop

ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను ధర రూ.19,999 గా ఉండనుంది. ఇతర వేరియంట్‌లను వరుసగా రూ.22,999, రూ.24,999 ధరలకు కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి 13 ప్లస్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ విక్టరీ గోల్డ్, స్పీడ్‌ గ్రీన్‌, డార్క్‌ పర్పుల్‌ కలర్‌ వేరియంట్‌లో లభిస్తుంది.

రియల్‌మి 13+ 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల FHD+ (2400*1080) అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 180Hz టచ్ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది.

realme 13 plus 5g Smartphone price drop

ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ Mali G615 GPU తో జతచేసి ఉంటుంది. ఈ ఫోన్‌లో గరిష్ఠంగా 26GB ర్యామ్‌ను ఉపయోగించవచ్చు. మరియు ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మి UI 5 OS తో పనిచేస్తుంది.

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP సోనీ ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. మరియు LED ఫ్లాష్‌ లైట్‌ను అమర్చి ఉంటుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ రియల్‌మి 13+ 5G స్మార్ట్‌ఫోన్ 16MP కెమెరాతో అందుబాటులో ఉంది.

ఈ ఫోన్‌ 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సామర్థ్యంతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే రెయిన్‌ వాటర్‌ స్మార్ట్ టచ్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా రియల్‌మి 13 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్‌ 5G, డ్యూయల్‌ 4G VoLTE, బ్లూటూత్‌ 5.4, వైఫై 6, GPS, USB-C ఛార్జింగ్ పోర్టు, 3.5mm ఆడియో జాక్‌ వంటి ఫీచర్‌లు ఉన్నాయి. కొత్త సంవత్సరం సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థలతోపాటు ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాంలు కూడా భారీగా డిస్కౌంట్‌లను అందిస్తున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart offers RS2000 discount on realme 13 plus 5g Smartphone check specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X