Home
Mobile

రూ.2000 తగ్గింపు.. 50MP + 50MP కెమెరాలు, 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ ఇచ్చే 5G స్మార్ట్‌ఫోన్‌!

నథింగ్ సబ్‌బ్రాండ్ CMF భారత్‌ మార్కెట్‌ లో ఇప్పటికే స్మార్ట్‌ఫోన్లతోపాటు అనేక ఉత్పత్తులను లాంచ్‌ చేసింది. ఈ సంవత్సరం తొలి భాగంలో CMF ఫోన్‌ 2 ప్రో ఫోన్‌ ను (CMF Phone 2 Pro 5G SmartPhone) లాంచ్‌ చేసింది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌లో అదనపు బ్యాంకు డిస్కౌంట్‌లను కూడా పొందవచ్చు. బడ్జెట్‌ ధరలో సాఫ్ట్‌వేర్‌ ఎక్పీరియన్స్‌ అందించే ఫోన్‌ కోసం చూస్తున్నట్లయితే ఈ CMF ఫోన్‌ను మంచి ఆప్షన్‌గా భావించవచ్చు. డిజైన్ సహా ఫీచర్ల పరంగానూ ఆకట్టుకుంటుంది.

CMF ఫోన్‌ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌ (CMF Phone 2 Pro Smartphone) విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.18,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.20,999 గా ఉండేది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.2000 డిస్కౌంట్‌ ధరకు అందుబాటులో ఉంది. ఫలితంగా ఈ ఫోన్‌ ధరలు రూ.16,999, రూ.18,999 గా ఉన్నాయి.

CMF Phone 2 Pro 5G Smartphone price in india

దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌లో ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.1,000 డిస్కౌంట్‌ ను అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బ్లాక్‌, ప్లస్‌ మెంబర్‌లకు బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ అందుబాటులోకి వచ్చింది. రేపటి నుంచి ఈ సేల్‌ లో అందరికీ అందుబాటులోకి రానుంది. ICICI, యాక్సెస్ బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్‌లను పొందవచ్చు.

సీఎంఎఫ్‌ ఫోన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ :
ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.77 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 3000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 480Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. మరియు HDR10+ సపోర్టును కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బ్లాక్‌, వైట్, లైట్‌ గ్రీన్, ఆరెంజ్‌ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

CMF Phone 2 Pro 5G Smartphone price in india

6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ :
CMF స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ప్రో ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Nothing OS 3.2 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్‌ రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. 3 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని CMF తెలిపింది.

50MP + 50MP కెమెరాలు :
కెమెరా విభాగం పరంగా ఫోన్‌ Truelens ఇంజిన్ 3.0 టెక్నాలజీ సపోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్‌ వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరా (EIS), 50MP టెలిఫోటో లెన్స్‌, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ను అమర్చి ఉంది. మరియు 16MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.

వైర్‌లెస్‌ ఛార్జింగ్ సపోర్టు :
ఈ హ్యాండ్‌సెట్‌ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ 5W రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టును కూడా కలిగి ఉంది. బ్లూటూత్‌ 5.3, వైఫై 6 తోపాటు USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. IP54 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Offers Rs2000 price discount on CMF Phone 2 Pro 5G Smartphone, features and specs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X