రూ.12999 ధరకు 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే, 7000mAh భారీ బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్!
ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026 లో భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్ లు డిస్కౌంట్ ధరకు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ సేల్ లో భాగంగా పోకో M7 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ ను (Poco M7 Plus 5G Smartphone) డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ భారీ డిస్‌ప్లే, భారీ బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు 50MP కెమెరాను కలిగి ఉంది. బడ్జెట్ ధరలో లేటెస్ట్ 5G ఫోన్ కోసం చూసే వారికి ఈ హ్యాండ్‌సెట్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.
రూ.12999 ధరకే :
ఫ్లిప్‌కార్ట్ లో (Flipkart Republic Day Sale 2026) ప్రస్తుతం 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ రూ.12999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ రూ.14,999 గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు.

పోకో M7 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ హ్యాండ్‌సెట్ 144Hz రీఫ్రెష్ రేట్ తో 6.9 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 850 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 288Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ IP64 రేటింగ్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ గా ఉంది.
4 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్ 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2.0 తో పనిచేస్తోంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ను పొందుతోంది.

50MP ప్రైమరీ కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్ కెమెరా యూనిట్ ను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ రెండు కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ, సెకండరీ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది.
7000mAh బ్యాటరీ :
ఈ ఫోన్ 33W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. 18W రివర్స్ ఛార్జింగ్ ను కూడా సపోర్టు చేస్తుంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.1, Wi-Fi, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.
పోకో M7 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్ సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ కార్బన్ బ్లాక్, ఆక్వా బ్లూ, క్రోమ్ సిల్వర్ కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది. బడ్జెట్ ధరలో ఫోన్‌ల కోసం చూసే వారికి ఈ హ్యాండ్‌సెట్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








