Home
Mobile

7000mAh బ్యాటరీ, 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 50MP కెమెరా 5G స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్‌!

Realme P4x 5G Smartphone : రియల్‌మి నుంచి గత సంవత్సరం P4 సిరీస్‌లో భాగంగా అనేక ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ సిరీస్‌ నుంచి గత నెలలో రియల్‌మి P4x స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ అయింది. ఈ హ్యాండ్‌సెట్ బడ్జెట్‌ ధరలో అందుబాటులోకి వచ్చింది. అయితే 50MP ప్రైమరీ కెమెరా, 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఫుల్‌ HD డిస్‌ప్లే, మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 అల్ట్రాతో పనిచేస్తుంది.

ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ 2026 లో (Flipkart Republic Day Sale 2026) భాగంగా రియల్‌మి P4x 5G స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు కార్డులపై అదనపు తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్‌ వేపర్‌ కూలింగ్‌ ఛాంబర్‌ను కూడా కలిగి ఉంది.

realme p4x 5G smartphone

ఈ స్మార్ట్‌ఫోన్‌ విడుదల సమయంలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.15499, 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.16999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.17999 గా ఉండేది. అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్‌ ధరకు అందుబాటులో ఉంది.

10 శాతం డిస్కౌంట్‌ :
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ ధర రూ.14999, రూ.16499 గా ఉంది. 256GB స్టోరేజీ వేరియంట్‌ ప్రస్తుతం అందుబాటులో లేదు. దీంతోపాటు HDFC బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. అంటే కనీసం రూ.1400 పైగా తగ్గింపును పొందవచ్చు.

144Hz రీఫ్రెష్‌ రేట్‌ :
రియల్‌మి P4x 5G స్మార్ట్‌ఫోన్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.72 అంగుళాల FHD LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1000 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ IP64 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్‌ ఎలిగెంట్‌ పింక్‌, లేక్ గ్రీన్, మ్యాటీ సిల్వర్‌ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

realme p4x 5G smartphone

3 సంవత్సరాల అప్‌డేట్స్ :
ఈ హ్యాండ్‌సెట్‌ ఆక్టాకోర్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Realme UI 6.0 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.

50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరా యూనిట్‌ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ, 2MP సెకండరీ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందువైపు 8MP కెమెరా ఉంది. ఈ ఫోన్‌ కాపర్‌ గ్రాఫైట్‌ కోటింగ్‌, స్టీల్‌ ప్లేట్‌తో కూడిన 5300mm Sq వేపర్‌ ఛాంబర్‌ కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది.

7000mAh బ్యాటరీ :
ఈ రియల్‌మి ఫోన్ 45W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తోంది. బైపాస్‌ ఛార్జింగ్‌, రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంది. మెరుగైన ఆడియో సపోర్టు కోసం డ్యూయల్‌ స్పీకర్లు ఉన్నాయి. 5G, 4G LTE, GPS, బ్లూటూత్, వైఫై, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Republic Day sale 2026 Offers discount offer on Realme P4x 5G smartphone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X