Home
Mobile

ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ 2026.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై బెస్ట్‌ డిస్కౌంట్ ఆఫర్లు..!

Flipkart Republic Day Sale 2026 : ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ జనవరి 17 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్‌, ప్లస్‌ మెంబర్లు 24 గంటల ముందుగానే సేల్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంది. ఈ సేల్‌లో భాగంగా HDFC బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌ స్మార్ట్‌ఫోన్‌ డీల్స్‌ వివరాలు వెల్లడయ్యాయి.

శాంసంగ్ :
ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా శాంసంగ్‌ గెలాక్సీ A35 5G స్మార్ట్‌ఫోన్‌ను (Samsung Galaxy A35 5G Smartphone) భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్‌ ఆధారంగా 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.18499 కే అందుబాటులోకి వస్తుంది.

Flipkart Republic day sale 2026 teased early bird deals

రియల్‌మి :
రియల్‌మి P3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.22999 కే అందుబాటులోకి ఉంటుంది. 6.83 అంగుళాల 1.5K క్వాడ్ కర్వడ్‌ OLED డిస్‌ప్లే, మీడియాటెక్‌ డైమెన్సిటీ 8350 అల్ట్రా చిప్‌, ఆండ్రాయిడ్‌ 15 OS పైన పనిచేస్తుంది. 50MP OIS + 8MP + 16MP సెల్ఫీ కెమెరాలున్నాయి. 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.

వివో :
ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్ డే సేల్‌ 2026 భాగంగా వివో T4 సిరీస్ ఫోన్‌పై డిస్కౌంట్‌ను పొందవచ్చు. వివో T4x ఫోన్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.14999 కే కొనుగోలు చేయవచ్చు. వివో T4 స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.20999 ధరకే సొంతం చేసుకోవచ్చు.

అదే వివో T4 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ను రూ.24999 కే సొంతం చేసుకోవచ్చు. అదే అల్ట్రా వేరియంట్‌ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ను రూ.32999 ధరకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. అయితే అల్ట్రా మోడల్‌ ఫోన్ సగం ధరకు అందుబాటులోకి వస్తుందని ఇటీవల లీక్స్‌ వచ్చాయి.

పోకో M7 ప్లస్ :
పోకో M7 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ గత సంవత్సరం విడుదల అయింది. ఫ్లిప్‌కార్ట్‌ లిస్టింగ్‌ ఆధారంగా ఈ ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.12999 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6s జెన్‌ 3 చిప్‌, ఆండ్రాయిడ్‌ 15 OS పైన పనిచేస్తోంది. 50MP ప్రైమరీ, 8MP సెల్ఫీ కెమెరాలున్నాయి.

AI+ నుంచి గత సంవత్సరం రెండు స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో AI+ పల్స్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.6499 కే కొనుగోలు చేయవచ్చని చెబుతోంది. అదే AI+ నోవా 6GB + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.7499 కే సొంతం చేసుకోవచ్చు.

ఈ సేల్‌లో భాగంగా గూగుల్‌ పిక్సల్ 10 స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ను రూ.64999 కే కొనుగోలు చేయవచ్చు. లిస్టింగ్‌ ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. దీంతోపాటు ఐఫోన్ 16, 17 మోడల్స్ పైనా డిస్కౌంట్‌లను పొందవచ్చు. ఐఫోన్‌ ఎయిర్‌ మోడల్‌ను రూ.93900 ధరకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart Republic day sale 2026 teased early bird deals on smartphones here is the list
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X