మోటో ఇ అమ్మకాలు రేపటి నుంచి పున:ప్రారంభం
ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదలై పెను సంచలనంగా నిలిచిన మోటరోలా లేటెస్ట్ వర్షన్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‘మోటో ఇ' విక్రయాలు రేపటి నుంచి మరో మారు ప్రారంభంకానున్నాయి. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేకంగా విక్రయిస్తున్న విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే.... భారత్ మార్కెట్లో ‘మోటో ఇ' విక్రయాలు మే 13 అర్థరాత్రి (తెల్లవారితే మే, 14) నుంచి ప్రారంభమయ్యాయి.

అయితే, అమ్మకాలు ప్రారంభమైన కొద్ది సేపటికే స్టాక్ మొత్తం అయిపోయినట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఫ్టిప్‌కార్ట్ ఒక్క రోజులో 80 నుంచి లక్ష మిలియన్ మోటో ఇ స్మార్ట్‌ఫోన్ యూనిట్లను విక్రయించినట్లు సమాచారం. ఇండియన్ మార్కెట్లో ‘మోటో ఇ' స్మార్ట్‌ఫోన్‌లకు మిశ్రమ స్పందన లభించటంతో ఆ ఫోన్ అమ్మకాలకు సంబంధించి ఫ్లిప్‌కార్ట్ ఇప్పటి వరకు రెండు సార్లు అవుట్ ఆఫ్ స్టార్ బోర్డ్‌లను తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయవల్సి వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు మే 23 ఉదయం 11 గంటల నుంచి మోటో ఇ విక్రయాలను మరోమారు ఫ్లిప్ కార్ట్ ప్రారంభించనుంది. కాబట్టి ఈ సారైనా మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.
మోటరోలా మోటో ఇ, 4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ తాకేతెరను కలిగి ఉంటుంది.రిసల్యూషన్ సామర్ధ్యం 540x 960పిక్సల్స్, 256 పీపీఐ పిక్సల్ డెన్సిటీ.కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 స్ర్కీన్‌ను మోటరోలా ఈ డివైస్‌ను వినియోగించింది. పొందుపరిచిన ‘వాటర్ నానో కోటింగ్ 'నీటి ప్రమాదాల నుంచి డివైస్‌ను రక్షిస్తుంది. 1.2గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ డివైస్ గ్రాఫిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తుంది.పొందుపరిచిన 1జీబి ర్యామ్ సౌకర్యవంతమైన మల్టీ టాస్కింగ్‌కు దోహదపడుతుంది. ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది.ఫోన్ వెనుక భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఫ్రంట్ కెమెరా లేదు. 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు పెంచుకునే అవకాశాన్ని మోటరోలా కల్పిస్తోంది. ఇండియన్ మార్కెట్లో మోటో ఇ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లో లభ్యమవుతోంది. ధర రూ.6,999.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








