Flipkart Sale 2026 : ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు..!
Flipkart Republic Day Sale 2026 : ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 17 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్, ప్లస్ మెంబర్లు 24 గంటల ముందే సేల్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంది. HDFC బ్యాంకు క్రెడిట్ కార్డుపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్స్, ఇయర్‌బడ్స్ సహా వాషింగ్ మెషిన్, రిఫ్రిజిరేటర్ల సహా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై డిస్కౌంట్‌లను పొందవచ్చని తెలుస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026 లో భాగంగా తాజాగా ఆపిల్, వివో, మోటోరోలా, రియల్‌మి బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్ డీల్స్ వివరాలను వెల్లడించింది. బ్యాంకు కార్డులు, ఎక్స్ఛేంజీ, నో కాస్ట్ EMI కారణంగా ఈ తగ్గింపును పొందవచ్చని తెలుస్తోంది.

ఐఫోన్ 16 :
ఐఫోన్ 16 మోడల్ ధర ప్రస్తుతం రూ.69999 గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా రూ.56999 ధరకు కొనుగోలు చేయవచ్చని చెబుతోంది. గూగుల్ పిక్సల్ 10 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.74999 ధరకు అందుబాటులో ఉంది. రిపబ్లికే డే సేల్‌లో భాగంగా రూ.60999 కే సొంతం చేసుకోవచ్చు.
వివో స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్‌లు :
వివో T4 సిరీస్ ఫోన్‌లపైనా డిస్కౌంట్‌లను ప్రకటించింది. సేల్‌లో భాగంగా వివో T4 లైట్ 5G ఫోన్‌ను రూ.9999, T4x 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ.14249, T4R 5G మోడల్‌ను రూ.18999, T4 5G హ్యాండ్‌సెట్‌ను రూ.20499 ధరకు కొనుగోలు చేయవచ్చని తెలిపింది.
నథింగ్ ఫోన్‌లపై :
నథింగ్ ఫోన్ 3a ప్రో (Nothing Phone 3a Pro Smartphone) మోడల్ ప్రస్తుతం రూ.33999 ధరకు అందుబాటులో ఉండగా.. సేల్ ప్రారంభం అయ్యాక రూ.26999 కే కొనుగోలు చేయవచ్చు. అదే CMF ఫోన్ 2 ప్రో (CMF Phone 2 Pro Smartphone) మోడల్ ప్రస్తుత ధర రూ.18999 గా ఉంది. సేల్‌లో భాగంగా రూ.16499 కే సొంతం చేసుకోవచ్చు.
నథింగ్ ఫోన్ 3a స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర ప్రస్తుతం రూ.24999 గా ఉంది. సేల్‌లో భాగంగా రూ.20 వేల కంటే తక్కువ ధరకు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ (Nothing Phone 3 Smartphone) ప్రస్తుతం రూ.79999 గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ సేల్ బ్యానర్ లో Unbelievable Price అనే ట్యాగ్‌లైన్ కనిపించింది.
దీని ఆధారంగా భారీ డిస్కౌంట్ ధరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. బ్యాంకు ఆఫర్లతో రూ.40 వేల కంటే తక్కువ ధరకు అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. గతంలోనూ ఈ ఫోన్ భారీ డిస్కౌంట్ ధరకు అందుబాటులోకి వచ్చింది.
మోటోరోలా స్మార్ట్‌ఫోన్ పై డిస్కౌంట్ :
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ (Motorola Edge 60 Fusion Smartphone) ప్రస్తుత ధర రూ.22999 గా ఉండగా.. సేల్‌లో భాగంగా రూ.19999 కే కొనుగోలు చేయవచ్చు. త్వరలో మరిన్ని స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ డీల్స్ వెల్లడయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








