ఆ నాలుగు రోజుల్లో భారీ తగ్గింపులు, 62 శాతానికి పైగానే..
ఈనెల 10న ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ విక్రయాల్లో భాగంగా 11-14 తేదీల్లో సెల్‌ఫోన్లపై 62 శాతం వరకు రాయితీ పొందవచ్చని కంపెనీలు ప్రకటిస్తున్నాయి.
ఈనెల 10న ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ విక్రయాల్లో భాగంగా 11-14 తేదీల్లో సెల్‌ఫోన్లపై 62 శాతం వరకు రాయితీ పొందవచ్చని కంపెనీలు ప్రకటిస్తున్నాయి. గెలాక్సీ ఎస్8 (64 జీబీ)ని రూ.20,000 రాయితీపై రూ.29,990కి విక్రయిస్తామని శాంసంగ్ ప్రకటించింది. పానసోనిక్ పీ91 స్మార్ట్‌ఫోన్‌ను 62 శాతం రాయితీపై రూ.2,990కి విక్రయించనున్నారు. హానర్10 స్మార్ట్‌ఫోన్‌పై రూ.8,000 రాయితీ ఇచ్చి రూ.24,999కి అమ్ముతామని హువావె తెలిపింది. ఆసుస్ కూడా తాజా 4జీ స్మార్ట్‌ఫోన్లపై రూ.1,000-2,000 రాయితీ ఇవ్వనున్నాయి.

బిగ్ బిలియన్ డేస్ పేరుతో వార్షిక సేల్..
ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ ఏడాది సైతం బిగ్ బిలియన్ డేస్ పేరుతో వార్షిక సేల్‌ను ప్రకటించింది. ఈ ఏడాది సేల్‌ను ప్రమోట్ చేసేందుకు కంపెనీ అమితాబ్ బచన్, విరాట్ కోహ్లీ వంటి సెలెబ్రిటీలతో ఒప్పందాలు చేసుకుంది.

అక్టోబర్ 10 నుంచి 14 వరకూ
అక్టోబర్ 10 నుంచి 14 వరకూ జరిగే బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది. మోటో, హానర్, శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై బెస్ట్ డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.

గెలాక్సీ ఎస్8
సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్8పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. రూ 45,990 విలువైన ఈ ఫోన్‌ను రూ 16,000 తక్కువగా రూ 29,990కు ఆఫర్ చేస్తున్నారు.

గెలాక్సీ ఆన్6
గెలాక్సీ ఆన్6 రూ 11,990కే అందుబాటులో ఉండగా గెలాక్సీ ఆన్ నెక్ట్స్ రూ 17,990కు గాను రూ 9990కే ఆఫర్‌లో ఉంది. జే3 ప్రో రూ 8,490 నుంచి రూ 6190కే సేల్‌లో అందుబాటులో ఉంది.

హానర్ కొత్త మోడల్స్
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో దాదాపు హానర్ కొత్త మోడల్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. హానర్ 9ఎన్ డీల్‌ను సూపర్‌స్టార్ ఆఫర్‌గా చెబుతున్నారు.

హానర్ 9ఎన్ ధర
హానర్ 9ఎన్ ధరను గణనీయంగా తగ్గించగా, హానర్ 7ఏ రూ 7999కి సేల్‌లో ఆఫర్‌లో ఉంచారు.

హానర్ 8 ప్రో
ఇక హానర్ 8 ప్రో, హానర్ 9ఐ వరుసగా 19,999, 12,999కి అందుబాటులో ఉన్నాయి.

హానర్ 9 లైట్
నాలుగు కెమెరాలతో కూడిన హానర్ 9 లైట్ రూ 16,999కు గాను రూ 11,999కే ఆఫర్‌లో అందుబాటులో ఉంది.

హానర్ 10
అత్యాధునిక ఫీచర్లు కలిగిన హానర్ 10 రూ 35,999 ధరకు గాను రూ 24,999కు సేల్‌లో అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








