రూ.8,999కే లెనోవో 4జీబి ర్యామ్ ఫోన్!

లెనోవో స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్లకు తెరలేపుతూ ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ 'Lenovo Mobile Fest'ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా హాట్ సెల్లింగ్ లెనోవో బ్రాండెడ్ ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్లతో పాటు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. జూన్ 26న ప్రారంభమైన ఈ సేల్ జూన్ 28న ముగుస్తుంది. ఆఫర్ల వివరాలను పరిశీలించినట్లయితే...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లెనోవో కే6 పవర్..

లెనోవో మొబైల్ ఫెస్ట్‌లో భాగంగా లెనోవో కే6 పవర్ 3జీబి ర్యామ్ వేరియంట్‌ను రూ.8,999కే ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. 4జీబి ర్యామ్ వేరియంట్‌ను రూ.9,999కే సొంతం చేసుకునే అవకావం. మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకోదలచినట్లయితే రూ.8,500 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూ లభిస్తుంది.

లెనోవో వైబ్ కే5 నోట్ 4జీబి ర్యామ్ వేరియంట్‌

లెనోవో మొబైల్ ఫెస్ట్‌లో భాగంగా రూ.12,499 ఖరీదు చేసే లెనోవో వైబ్ కే5 నోట్ 4జీబి ర్యామ్ వేరియంట్‌ను కేవలం రూ.10,499కే ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకోదలచినట్లయితే రూ.9,500 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూ క్రింద లభిస్తుంది. రూ.11,499 ఖరీదు చేసే లెనోవో వైబ్ కే5 నోట్ 3జీబి ర్యామ్ వేరియంట్‌ను రూ.9999కే సొంతం చేసుకునే అవకాశం.

లెనోవో వైబ్ కే5 ప్లస్‌

లెనోవో మొబైల్ ఫెస్ట్‌లో భాగంగా రూ.8,499 ఖరీదు చేసే లెనోవో వైబ్ కే5 ప్లస్‌ను రూ.7,499కే ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకోదలచినట్లయితే రూ.7,000 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూ క్రింద లభిస్తుంది.

లెనోవో పీ2 (4 జీబి ర్యామ్) వేరియంట్‌

లెనోవో మొబైల్ ఫెస్ట్‌లో భాగంగా రూ.16,999 ఖరీదు చేసే లెనోవో పీ2 (3జీబి ర్యామ్) వేరియంట్‌ను రూ.12,999కే ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకోదలచినట్లయితే రూ.12,000 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూ క్రింద లభిస్తుంది. లెనోవో పీ2 (4 జీబి ర్యామ్) వేరియంట్‌ను రూ.14,999కే ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకోదలచినట్లయితే రూ.14,000 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూ క్రింద లభిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Flipkart Sale on Brings Down Lenovo K6 Power, Vibe K5 Note, Vibe K5 Plus, P2 Prices. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot