ఫ్లిప్‌కార్ట్ సేల్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 3D కర్వడ్ డిస్‌ప్లే 5G ఫోన్ పై రూ.2000 డిస్కౌంట్..!
ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం SASA LELE పేరుతో ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా అనేక స్మా్ర్ట్‌ఫోన్‌లను డిస్కౌంట్ ధరలకే కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ మే 8 వ తేదీ వరకు జరుగుతుంది. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మోటోరోలా G85 5G స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు ఆఫర్ల ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 3D కర్వడ్ డిస్‌ప్లే తోపాటు 50MP కెమెరాను కలిగి ఉంది.
మోటోరోలా G85 5G స్మార్ట్‌ఫోన్ (Motorola G85 5G Smartphone) భారత్ మార్కెట్‌లో గత సంవత్సరం విడుదల అయింది. విడుదల సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.17999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ రూ.15999 కే కొనుగోలు చేయవచ్చు.

అదే 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ రూ.19999 కు విడుదల అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.17999 కే సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు బ్యాంకు కార్డులతో మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ కోబాల్ట్ బ్లూ, ఒలివ్ గ్రీన్, అర్బన్ గ్రే, వివా మజెంటా కలర్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
మోటోరోలా G85 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
మోటోరోలా G85 5G స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. Adreno 619 GPU ను కూడా కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 Hello UI పైన పనిచేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల FHD+ 3D కర్వడ్ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు ఈ డిస్‌ప్లే 1600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ను పొందుతుంది.
ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) తో 50MP సోనీ LYT 600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను అమర్చారు. వెనుక వైపు LED ఫ్లాష్ లైట్‌ను కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ 33W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ IP52 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 5G, 4G VoLTE, బ్లూటూత్ 5.1, వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. భద్రత కోసం ఈ హ్యాండ్‌సెట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ యాక్సెలిరోమీటర్, ప్రాక్సిమిటీ, యాంబియంట్ లైట్, గైరోస్కోప్, ఇ-కంపాస్ వంటి సెన్సార్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








