SASA LELE : ఫ్లిప్‌కార్ట్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు.. ఫీచర్‌లు, ధర పూర్తి వివరాలు..!
ఫ్లిప్‌కార్ట్ SASA LELE సేల్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సేల్‌లో భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ల్యాప్‌ట్యాప్, గ్యాడ్జెట్స్ సహా ఇతర గృహోపకరణాలను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్‌లో భాగంగా పోకో స్మార్ట్‌ఫోన్‌లను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఈ జాబితాలో పోకో C75 5G, పోకో M7 5G, పోకో M7 ప్రో 5G, ప్రో X7 5G, పోకో X7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి.
పోకో ఫోన్‌లను కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఫ్లిప్‌కార్ట్ సేల్ (Flipkart SASA LELE 2025) బెస్ట్ ఆప్షన్‌గా ఉంది. ఈ సేల్ మే 8 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో అందిస్తున్న డిస్కౌంట్‌లతోపాటు SBI క్రెడిట్ కార్డుల ద్వారా 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.

పోకో M7 5G స్మార్ట్‌ఫోన్ :
ఈ స్మార్ట్‌ఫోన్ (Poco M7 5G) 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9499 గా ఉంది. అదే 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.10699 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది.
ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS ను కలిగి ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5160mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరాతోపాటు మరో కెమెరాను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది.
పోకో M7 ప్రో 5G :
ఈ స్మార్ట్‌ఫోన్ (Poco M7 Pro 5G) 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.12999 కే కొనుగోలు చేయవచ్చు. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.14999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 6.67 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా SoC చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS పైన పనిచేస్తుంది. మరియు 45W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5110mAh బ్యాటరీని కలిగి ఉంది. వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. మరియు ముందువైపు 20MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
పోకో C75 5G :
ఈ స్మార్ట్‌ఫోన్ (Poco C75 5G) 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ రూ.7699 కే కొనుగోలు చేయవచ్చు. అదే 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.8499 కి సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 ప్రాసెసర్‌ను కలిగి ఉంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS తో పనిచేస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 50MP ప్రైమరీ కెమెరా సహా మరో కెమెరాను కలిగి ఉంది. ముందు వైపు 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 18W ఛార్జింగ్‌ను సపోర్టుతో 5160mAh బ్యాటరీని కలిగి ఉంది.
పోకో X7 5G, X7 ప్రో 5G :
ఫ్లిప్‌కార్ట్‌లో పోకో X7 5G (Poco X7 5G) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.16999 కే కొనుగోలు చేయవచ్చు. అదే 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.18999 కే సొంతం చేసుకోవచ్చు. అదే పోకో X7 ప్రో (Poco X7 Pro 5G) మోడల్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.23999 గా ఉంది.
మరియు 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.25999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో నిన్నటి నుంచి ప్రారంభం అయింది. ఈ నెల 8 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లు, గ్యాడ్జెట్స్ తోపాటు గృహోపకరణాలను డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








