Home
Mobile

ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్‌ చిప్‌సెట్‌ ఫోన్‌పై రూ.3000 తగ్గింపు!

ఫ్లిప్‌కార్ట్‌ ప్రస్తుతం SASA LELE సేల్‌ నిర్వహిస్తోంది. ఈ సేల్‌ రేపటి వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌, గ్యాడ్జెట్స్‌ లను డిస్కౌంట్‌ ధరలకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు కార్డుల ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు. ప్రస్తుతం ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు.

గత సంవత్సరం మే నెలలో భారత్‌ మార్కెట్‌ లో మోటోరోలా ఎడ్జ్‌ 50 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌ (Motorola Edge 50 Fusion) లాంచ్‌ అయింది. విడుదల సమయంలో ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.22,999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా రూ.19,999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.3000 తగ్గింపును పొందవచ్చు.

Flipkart SASA LELE offers rs3000 discount on motorola Edge 50 Fusion smartphone

అదే విధంగా 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ రూ.24,999 కు విడుదల అయింది. ప్రస్తుతం రూ.21,999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ వేరియంట్‌పైనా రూ.3 వేలు డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు SBI క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ కొనుగోలు చేసేందుకు ఈ లింక్‌ పైన క్లిక్‌ చేయండి.

3D కర్వడ్‌ డిస్‌ప్లే :
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల FHD+ pOLED 3D కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 1600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

స్నాప్‌డ్రాగన్‌ చిప్‌సెట్‌ :
ఎడ్జ్‌ 50 ఫ్యూజన్‌ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 2 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్‌తోపాటు Adreno 710 GPU ను కూడా కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 12GB LPDDR4x ర్యామ్‌, 256GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Hello UI ను కలిగి ఉంది.

4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ :
ఈ మోటోరోలా ఫోన్‌ 3 సంవత్సరాల ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 68W టర్బో పవర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

50MP ప్రైమరీ కెమెరా :
మోటోరోలా ఫోన్ కెమెరా విభాగం పరంగా మెరుగైన అనుభూతిని అందిస్తోంది. ఈ ఫోన్‌ డ్యూయల్ రియర్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ LYT 700C ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 13MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ను కలిగి ఉంది. 32MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.

IP68 రేటింగ్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ IP68 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్‌ మోటో కనెక్ట్‌, ఫ్యామిలి స్పేస్‌ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ ఫోన్ 5G, 4G VoLTE, బ్లూటూత్ 5.2, వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ మోటోరోలా ఫోన్ ఫారెస్ట్‌ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్‌, హాట్ పింక్‌, మార్స్‌మల్లో బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో పనిచేస్తుంది.

గమనిక : గిజ్‌బాట్ వెబ్‌సైట్‌లోని అఫిలియేట్ లింక్స్‌ ద్వారా చేసిన కొనుగోళ్ల నుంచి కమీషన్‌ను సంపాదిస్తుంది. ఉత్పత్తులకు సంబంధించిన అసలైన అభిప్రాయాలు, వ్యక్తిగత అనుభవం ఆధారంగా సిఫార్సు చేయబడతాయి. అది కూడా మీకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart SASA LELE offers rs3000 discount on motorola Edge 50 Fusion smartphone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X