వేగంగా అమ్ముడుపోయిన మోటో జీ5 ప్లస్

తమ వెబ్‌సైట్‌లో మోటో జీ5 ప్లస్ అమ్మకాలు సరికొత్త రికార్డును నెలకొల్పాయని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. మార్చి 15,16 తేదీల మధ్య నిర్వహించిన ఓపెన్ సేల్‌లో భాగంగా నిమిషానికి 50కు పైగా మోటో జీ5 ప్లస్ యూనిట్లను విక్రయించగలిగామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ సేల్‌లో ఎన్ని ఫోన్‌లు అమ్ముడయ్యాయన్న విషయాన్ని వెబ్‌సైట్ వెల్లడించలేదు.

Read More : స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీని శాసిస్తోన్న ఒప్పో స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ క్రింద

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ క్రింద 4000 మంది యూజర్లు తమ మోటరోలా ఫోన్‌లతో కొత్త మోటో జీ5 ప్లస్ ఫోన్‌లను ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

'Buyback Guarantee' స్కీమ్..

ఈ ఫోన్ కొనుగోలు పై 'Buyback Guarantee' ప్రోగ్రామ్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్‌లో భాగంగా మోటో జీ5 ప్లస్ యూజర్లు వచ్చే 6 నుంచి 8 నెలల కాలంలో తమ ఫోన్‌ను వేరొక కొత్త ఫోన్‌తో ఎక్స్‌‌ఛేంజ్ చేసుకోదలిచినట్లయితే రూ.7,000 ఫిక్సుడ్ డిస్కౌంట్ లభిస్తుంది.

నోకియా 6 దమ్మెంతో చూస్తారా..?

మోటో జీ5 ప్లస్ స్పెసిఫికేషన్స్..

మోటో జీ5 ప్లస్ స్పెసిఫికేషన్స్.. 5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ ( (3జీబి, 4జీబి ర్యామ్), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

మోటో జీ5 ప్లస్ స్పెసిఫికేషన్స్..

12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్ సపోర్ట్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000mAh బ్యాటరీ విత్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్. 3జీబి ర్యామ్ + 16జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. 4జీబి ర్యామ్ + 32జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.16,999. Flipkart ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

వివో కొత్త ఫోన్ కేక

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Flipkart says Moto G5 Plus fastest selling smartphone on the site. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot