మరికొద్ది గంటల్లో షియోమి Mi A1 విడుదల
డ్యుయల్ కెమెరా, 5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే, 4జీబి ర్యామ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్...
షియోమి ఇండియా నుంచి మరికొద్ది గంటల్లో లాంచ్ కాబోతోన్న కొత్త స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఓ స్పష్టమైన క్లారిటీ వచ్చింది. షియోమి Mi A1 పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది.

ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్
ఈ ఫోన్‌కు సంబంధించిన లాంచ్ ఈవెంట్, ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు జరగబోతోంది. షియోమీ, గూగుల్ కాంభినేషన్‌లో రాబోతోన్న ఈ Android One స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఆసక్తికర వివరాలు ఇంటర్నట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

శక్తివంతమైన ఫీచర్లు..
డ్యుయల్ కెమెరా సపోర్ట్‌తో రావొచ్చని భావిస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే, 4జీబి ర్యామ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఉండొచ్చని తెలుస్తోంది.

షియోమీతో కలిస ముందుకు...
గూగుల్ తన ఆండ్రాయిడ వన్ ప్రాజెక్టును 2014లో లాంచ్ చేసింది. చౌకధర స్మార్ట్‌ఫోన్‌లకు సైతం ఆండ్రాయిడ్ అనుభూతులను చేరవ చేయాలనే లక్ష్యంతో డిజైన్ చేయబడిన ఈ స్టాక్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. మైక్రోమాక్స్, కార్బన్, స్పైస్ వంటి కంపెనీలు తక్కువ ధరల్లో Android One స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి తీసుకువచ్చినప్పటికి ఆదరణ కొరవడటంతో గూగుల్ ఈ ప్రాజెక్టును కొంత కాలం పక్కన పెట్టింది. చాలా రోజుల గ్యాప్ తరువాత షియోమీ సంస్థ సహకారంతో మరో ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది.


Click it and Unblock the Notifications