Home
Mobile

దిగ్గజాలను కలవరపెడుతున్న శాంసంగ్ కొత్త ఫోన్

ఇండియాలో నంబర్‌వన్ స్థానంలో దూసుకుపోతున్న దక్షిణకొరియా దిగ్గజం శాంసంగ్ త్వరలోనే మరో ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తోంది.

By Hazarath Aiah

ఇండియాలో నంబర్‌వన్ స్థానంలో దూసుకుపోతున్న దక్షిణకొరియా దిగ్గజం శాంసంగ్ త్వరలోనే మరో ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. సంచలనం సృష్టించిన గెలాక్సీ సీరిస్ లో భాగంగా గెలాక్సీ నోట్‌ 9 పేరుతో ఈ మొబైల్ మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫ్లాగ్‌షిప్‌ను ఆగస్టు 9న గ్లోబల్‌గా లాంచ్‌ చేస్తామని కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఈ డివైజ్‌ గురించి ఓ టీజ్‌ కూడా చేసింది. తర్వాత నోట్‌ లాంచింగ్‌ ఈవెంట్‌ న్యూయార్క్‌లో ఉంటుందని తెలిపింది. అదే రోజు భారత్‌లో కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్టు దేశీయ ఈ-కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. నోట్‌ 9 లాంచింగ్‌ గురించి ఓ టీజర్‌ను కూడా పోస్టు చేసింది. అదే టీజర్‌ను శాంసంగ్‌ తన మొబైల్‌ యాప్‌లో కూడా పొందుపరిచింది.

భారత్‌లో గెలాక్సీ 9..

భారత్‌లో గెలాక్సీ 9..

ఆగస్టు 9న భారత్‌లో గెలాక్సీ 9ను సాఫ్ట్‌ లాంచ్‌ చేయనుందని.. అధికారిక లాంచ్‌ మాత్రం ఆగస్టు 15నేనని, అదే రోజు విక్రయాలు కూడా ప్రారంభమవుతాయనీ తెలుస్తోంది.

 గెలాక్సీ నోట్ ‌9..

గెలాక్సీ నోట్ ‌9..

దీంతో గెలాక్సీ నోట్ ‌9 అందుబాటులోకి రాబోతున్న తొలి దేశాల్లో భారత్‌ కూడా ఉంటుంది. ఈ డివైజ్‌ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే గెలాక్సీ నోట్‌ 9 ధర ఎలా ఉంటుందో సమాచారం లేదు.

70 వేల రూపాయలు..

70 వేల రూపాయలు..

దీని ధర కూడా 70 వేల రూపాయలు లేదా అంతకంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చని తెలుస్తోంది. కాగా ఇది ఆల్ట్రా హై-ఎండ్‌ ఫోన్‌గా మార్కెటోకి వస్తోంది.

గెలాక్సీ నోట్‌ 9 ఫీచర్లు( అంచనా )

గెలాక్సీ నోట్‌ 9 ఫీచర్లు( అంచనా )

6.4 అంగుళాల హై-రెజుల్యూషన్‌ ఓలెడ్‌ స్క్రీన్‌
3850 ఎంఏహెచ్‌ బ్యాటరీ
6 జీబీ ర్యామ్‌
256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
ఆండ్రాయిడ్‌ ఓరియో
అమెరికా, ఇతర కొన్ని దేశాల్లో నోట్‌ 9 ప్రాసెసర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 845
స్వదేశం, కీ మార్కెట్లలో ఎక్సీనోస్‌ 9810 ప్రాసెసర్‌
వెనుకవైపు డ్యూయల్‌ కెమెరా సిస్టమ్‌
ముందు వైపు 8 మెగాపిక్సెల్‌ కెమెరా
యానిమేటెడ్‌ ఎమోజీలు, ఫేస్‌ అన్‌లాక్‌, పోట్రైట్‌ మోడ్‌

Best Mobiles in India

English summary
Flipkart teaser hints Samsung Galaxy Note 9 to launch in India on August 9, sale around August 15 more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X