ఫ్లిప్‌కార్ట్ నుంచి తొలిసారిగా డ్యూయెల్ కెమెరా ఫోన్,ఈ నెల 15న ముహూర్తం
ఈ కామర్స్ దిగ్గజం తొలిసారిగా మొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. బిలియన్ క్యాప్చర్ ప్లస్ పేరుతో నవంబర్ 15న డ్యూయెల్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయబోతోంది.
ఈ కామర్స్ దిగ్గజం తొలిసారిగా మొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. బిలియన్ క్యాప్చర్ ప్లస్ పేరుతో నవంబర్ 15న డ్యూయెల్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయబోతోంది. ఈ ఏడాది జులైలో ఈ ఫోన్ ని కంపెనీ అనౌన్స్ చేసిన విషయం విదితమే. మేడ్ ఇన్ ఇండియా కోసం ఇండియా యూజర్లను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్ వస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

బిలియన్ క్యాప్చర్ ప్లస్ ఫీచర్లు
3/4జిబి ర్యామ్, 32/64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, విస్తరణ సామర్ధ్యం 128 జిబి వరకు
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్
5.5 ఇంచ్ హెచ్‌డి పుల్ డిస్‌ప్లే, రిజల్యూషన్ 1080x1920 pixels
2.5D Dragontrail glass
octa-core Snapdragon 625
3500mAh battery, రెండు రోజుల బ్యాటరీ లైఫ్
USB Type-C with quick charge support.
15 నిమిషాల్లో 7 గంటల బ్యాటరీ లైఫ్
13 ఎంపీ డ్యూయెల్ ఫ్లాష్ కెమెరా
అపరిమిత క్లౌడ్ స్టోరేజ్

ధర
3జిబి ర్యామ్ 32 జిబి స్టోరేజ్ ఫోన్ ధర రూ. 10,999
3జిబి ర్యామ్ 32 జిబి స్టోరేజ్ ఫోన్ ధర రూ. 12,999
Mystic Black and Desert Gold రంగుల్లో లభ్యం

ఫ్లిప్‌కార్ట్ ఓ ప్రత్యేక పేజీని..
ఈ స్మార్ట్‌ఫోన్ కోసం ఫ్లిప్‌కార్ట్ ఓ ప్రత్యేక పేజీని కూడా ఏర్పాటు చేసింది. నవంబర్ 15న ఇది మార్కెట్‌లోకి రాబోతుంది. దేశవ్యాప్తంగా ఉన్న 125 నగరాల్లో 130 సర్వీసు సెంటర్లతో తాము భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

ప్రైవేట్ లేబుల్ కిందనే..
ఈ కొత్త ప్రైవేట్ లేబుల్ కిందనే ఫ్లిప్‌కార్ట్ మిక్సర్స్, గ్రైండర్స్, కుక్‌వేర్, బ్యాక్‌ప్యాక్స్, స్మార్ట్‌ఫోన్లు, టీ-షర్ట్స్, ఎలక్ట్రిక్ ఐరాన్స్ వంటి వాటిని ఆఫర్ చేస్తోంది.


Click it and Unblock the Notifications