ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు.. లిస్ట్, ఆఫర్ల వివరాలు..!
ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ జులై 12 నుంచి 17 వరకు GOAT సేల్ జరగనుంది. ఇప్పటికే ఈ సేల్‌కు సంబంధించిన అనేక వివరాలు వెల్లడయ్యాయి. అయితే ఐఫోన్ 16 ను ఈ సేల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 16 ను రూ.79,900 ధరకు విడుదల అయింది. ఈ సేల్‌లో భాగంగా సుమారు రూ.60,000 కే సొంతం చేసుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు జులై 11 వ తేదీ 12 AM IST గంటలకు ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో భాగంగా HDFC, IDFC ఫస్ట్, HSBC, BOB card, RBL, యాక్సెస్ బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు EMI ఆప్షన్‌లు కూడా అందుబాటులో ఉంటుంది.

ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్ ను ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో (Flipkart Sale) భాగంగా రూ.5X,XXX కే కొనుగోలు చేయవచ్చని చెబుతోంది. అయితే కచ్చితమైన ధర వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈ ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్ 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది.
ఈ ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్ A18 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. కెమెరా విభాగం పరంగా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 48MP కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరాను అమర్చి ఉంది. ఈ ఫోన్ కెమెరా కంట్రోల్ బటన్‌ను కూడా కలిగి ఉంది.
Flipkart GOAT సేల్ లో భాగంగా స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, హెడ్‌ఫోన్స్ తోపాటు గృహోపకరణాలను కూడా కొనుగోలు చేస్తుంది. స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో డీల్స్ గురించి అనేక వివరాలు వెల్లడయ్యాయి. ఈ సేల్‌లో భాగంగా ఆపిల్, శాంసంగ్, గూగుల్, మోటోరోలా, నథింగ్ బ్రాండ్‌ల ఫోన్‌లను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు.

ఆపిల్ ఐఫోన్స్ డీల్స్ :
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ - రూ.1,32,900
ఐఫోన్ 16 ప్రో - రూ.99,900
ఐఫోన్ 16e - రూ.50,900
ఐఫోన్ 15 ప్లస్ - రూ.71,900
ఐఫోన్ 15 - రూ.61,900
ఐఫోన్ 14 - రూ.48,990
శాంసంగ్ డీల్స్ :
శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ - ప్రారంభ ధర రూ.69,999
శాంసంగ్ గెలాక్సీ S24 - రూ.46,999
శాంసంగ్ గెలాక్సీ S24 FE - రూ.35,999
గెలాక్సీ F55 - రూ.20,999
గెలాక్సీ A35 - రూ.19,999
గెలాక్సీ A56 - రూ.36,999
గెలాక్సీ A36 - రూ.28,999
గూగుల్ పిక్సల్ ఫోన్ డీల్స్ :
గూగుల్ పిక్సల్ 9 ప్రో ఫోల్డ్ - రూ.1,37,999
పిక్సల్ 9 ప్రో XL - రూ.89,999
పిక్సల్ 9 ప్రో - రూ.81,999
పిక్సల్ 9 - రూ.57,999
పిక్సల్ 9a - రూ.46,999
పిక్సల్ 8 - రూ.47,999
పిక్సల్ 8a - రూ.29,999
పిక్సల్ 8 ప్రో - రూ.49,999
మోటోరోలా ఫోన్ డీల్స్ :
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ - రూ.19999
ఎడ్జ్ 60 ఫ్యూజన్ - రూ.20999
ఎడ్జ్ 60 ప్రో - రూ.27999
ఎడ్జ్ 60 స్టైలస్ - రూ.21999
మోటోరోలా G45 - రూ.10999
నథింగ్ ఫోన్ డీల్స్ :
నథింగ్ ఫోన్ 3a - రూ.22,999
నథింగ్ ఫోన్ 3a ప్రో - రూ.27,999
నథింగ్ ఫోన్ 2a (256GB ర్యామ్) - రూ.22,999
నథింగ్ ఫోన్ 2a ప్లస్ - రూ.26,999


Click it and Unblock the Notifications








