Home
Mobile

ఫ్లిప్‌కార్ట్‌ వాలెంటైన్స్‌ డే సేల్‌.. ఈ ఐఫోన్‌, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు..!

Flipkart Valentines Day Sale 2026 : ఫ్లిప్‌కార్ట్‌ ప్రస్తుతం వాలెంటైన్స్‌ డే సేల్‌ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్‌లు సహా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌ ను అందిస్తోంది. ఇటీవల లాంచ్‌ అయిన ఐఫోన్ 17 సిరీస్‌ (iPhone 17 Series) సహా అనేక లేటెస్ట్‌ మోడల్స్‌ ను తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్‌ ను కూడా అందిస్తోంది.

ఐఫోన్‌ మోడల్స్‌ పై డిస్కౌంట్‌లు :
ఫ్లిప్‌కార్ట్ వాలెంటైన్స్‌ డే సేల్‌ లో భాగంగా ఐఫోన్‌ 17 ను రూ.74900 ధరకు కొనుగోలు చేయవచ్చు. అదే ఐఫోన్ 17 ప్రో మోడల్‌ ను రూ.1,33,499, ఐఫోన్‌ 17 ప్రో మ్యాక్స్‌ ను రూ.1,48,400 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 16 ను రూ.56999 ధరకు కొనుగోలు చేయవచ్చు.

Flipkart Valentines Day Sale 2026

ఐఫోన్ 17 :
ఐఫోన్ 17 స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 6.3 అంగుళాల ప్రో మోషన్‌ OLED సూపర్ రెటీనా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. సిరామిక్‌ షీల్డ్‌ 2 ప్రొటెక్షన్‌ ను పొందుతోంది. లిక్విడ్‌ గ్లాస్ డిజైన్‌ తో అందుబాటులో ఉంది. IP68 రేటింగ్‌ తో డస్ట్, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంది.

ఈ ఫోన్ A19 చిప్‌సెట్‌, iOS 26 OS పైన పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా OIS సపోర్టుతో 48MP ప్రైమరీ కెమెరా, 2x జూమ్‌తో 12MP టెలిఫోటో కెమెరా, 18MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ యాక్షన్‌ బటన్‌, కెమెరా కంట్రోల్ బటన్‌లను కలిగి ఉన్నాయి.

ఐఫోన్ 17 సిరీస్‌తోపాటు లాంచ్ అయిన ఐఫోన్‌ 17 ఎయిర్‌ మోడల్‌ రూ.97500 ధరకు అందుబాటులో ఉంది. అదే ఐఫోన్‌ 16 ప్లస్‌ వేరియంట్‌ ను రూ.68499, ఐఫోన్ 16e మోడల్‌ ను రూ.58400, ఐఫోన్‌ 15 ను రూ.53400 ధరకు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు డిస్కౌంట్‌లతో ఈ ధరలకు కొనుగోలు చేయవచ్చు.

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లపైనా ఆఫర్లు :
ఫ్లిప్‌కార్ట్‌ లో సేల్‌లో ఐఫోన్‌ మోడల్‌తోపాటు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను కూడా భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ జాబితాలో గూగుల్‌, శాంసంగ్‌ సహా మరిన్ని బ్రాండ్‌లు ఉన్నాయి. శాంసంగ్‌ గెలాక్సీ S25 ప్లస్‌ మోడల్‌ ను రూ.74999 ధరకు కొనుగోలు చేయవచ్చు.

అదే గెలాక్సీ S25 FE స్మార్ట్‌ఫోన్‌ ను రూ.54999, గెలాక్సీ S24 మోడల్‌ ను రూ.42999, గెలాక్సీ S24 FE ఫోన్‌ను రూ.38999 ధరకు కొనుగోలు చేయవచ్చు. గెలాక్సీ A36 ఫోన్‌ను రూ.30499, గెలాక్సీ A35 స్మార్ట్‌ఫోన్‌ను రూ.19999 ధరకు సొంతం చేసుకోవచ్చు.

ఈ సేల్‌లో భాగంగా గూగుల్‌ పిక్సల్‌ 10 స్మార్ట్‌ఫోన్‌ను రూ.64999, పిక్సల్‌ 9a మోడల్‌ను రూ.36999 ధరకు సొంతం చేసుకోవచ్చు. మోటోరోలా ఇటీవల లాంచ్ చేసిన సిగ్నేచర్‌ మోడల్‌ రూ.54999, పోకో F7 5G స్మార్ట్‌ఫోన్‌ ను రూ.31999 ధరకు కొనుగోలు చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Flipkart Valentines Day Sale 2026 best deals on iphones and samsung, google smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X