అదిరే ఫీచర్స్‌తో ఫ్లయ్ డ్యూయల్ ఫోన్లు..

Posted By: Staff

అదిరే ఫీచర్స్‌తో ఫ్లయ్ డ్యూయల్ ఫోన్లు..

 

అంతర్జాతీయంగా మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేస్తున్న ఫ్లయ్ మొబైల్స్ రష్యాలో ఇటీవల రెండు డ్యూయల్ సిమ్ ఫోన్స్‌ని విడుదల చేసింది. వాటి పేర్లు ఫ్లయ్ బి 300, ఫ్లయ్ బి 500. రెండు మొబైల్స్ కూడా డ్యూయల్ సిమ్ ప్రత్యేకతను కలిగి ఉండడం ఇక్కడ విశేషం. రెండు మొబైల్స్ కూడా యూజర్స్ కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 2.4 ఇంచ్ టచ్ స్క్రీన్‌తో పాటు, స్క్రీన్ రిజల్యూషన్ 240 x 320 ఫిక్సల్‌గా కలిగి ఉన్నాయి.

మొబైల్‌తో పాటు 44MB ఇంటర్నల్ మెమరీ లభించగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే ఫ్లయ్ బి 300 మొబైల్ 3 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉండగా, అదే ఫ్లయ్ బి 500 మొబైల్ 5 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉంది. రెండు మొబైల్స్‌‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ప్రత్యేకం. కెమెరాలతో వీడియో కాల్స్‌ని కూడా తీసుకొవచ్చు.

రెండు మొబైల్స్ చుట్టుకొలతలు 115.9 x 51 x 11.3 mm ఒకే విధంగా ఉన్నప్పటికీ, ఫ్లయ్ బి 300 మొబైల్ బరువు 84 గ్రాములు ఉండగా, అదే ఫ్లయ్ బి 500 మొబైల్ బరువు 114 గ్రాములుగా ఉంది. రెండు మొబైల్స్ కూడా పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందివ్వడానికి గాను 850 mA / h బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. మొబైల్ టాక్ టైమ్ 4 గంటలు. స్టాండ్ బై టైమ్ 220 గంటలుగా వస్తుందని అభివర్ణిస్తున్నారు.

ఫ్లయ్ బి 300 మొబైల్ ప్రత్యేకతలు:

* మొబైల్ ధర సుమారుగా రూ 5400

* నెట్ వర్క్: GSM / GPRS 900/1800 MHz Dual SIM Standby

* చుట్టుకొ లతలు: 115.85 x 51 x 11.3 mm

* బరువు: 84 grams

* డిస్ ప్లే: 2.4 inch, 240×320 pixels

* కెమెరా: 3.2 megapixel with video recording (HVGA), work in Web camera

* మెమరీ: 43.8 MB storage, microSD slot for memory cards (up to 32 GB)

* Built-in media player

* FM-radio

* Support for Java MIDP 2.0

* కనెక్టివిటీ: Bluetooth v2.1, mini USB, 3.5 mm audio jack

* బ్యాటరీ: Li-Ion, 850 mA / h

ఫ్లయ్ బి 300 మొబైల్ ప్రత్యేకతలు:

* మొబైల్ ధర సుమారుగా రూ 6750

* చుట్టుకొ లతలు: 115.85 x 51 x 11.3 mm

* బరువు:: 114 gr

* న: 2.4 inch, 240×320 pixels

* కెమెరా: 5 megapixel with lights, video support (HVGA), work in Web Camera

* మెమరీ: 43.8 MB storage, microSD slot for memory cards (up to 32 GB)

* Built-in media player

* FM-radio

* Support for Java MIDP 2.0

* కనెక్టివిటీ: Bluetooth v2.1, mini USB, 3.5 mm audio jack

* బ్యాటరీ: Li-Ion, 800 mA / h

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot