ఎగిరేందుకు సిద్దం ఈ 'బ్లాక్‌బర్డ్' తో...

Posted By: Staff

 

ఎగిరేందుకు సిద్దం ఈ 'బ్లాక్‌బర్డ్' తో...
ఇండియాలో ప్రాచుర్యం పొందిన మొబైల్ ఫోన్ కంపెనీలలో ఒకటైన ఫ్లయ్ మొబైల్స్  కొత్త ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తుంది. దాని పేరు 'ఫ్లయ్ బ్లాక్‌బర్డ్'. డ్యూయల్ సిమ్ ఫీచర్‌తో పాటు మ్యూజిక్, టచ్ ఫీచర్స్ దీని సొంతం. వన్ ఇండియా పాఠకలు కోసం  'ఫ్లయ్ బ్లాక్‌బర్డ్' ప్రత్యేకతలు క్లుప్తంగా అందజేయడం జరుగుతుంది.

యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని స్క్రీన్ సైజు 3.5 ఇంచ్‌లుగా రూపొందించడం జరిగింది. టిఎఫ్‌టి టచ్ స్క్కీన్ డిస్ ప్లే దీని సొంతం. మొబైల్ బరువు 120 గ్రాములు. మొబైల్ వెనుక భాగాన ఉన్న 3 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలతో పాటు, వీడియోని కూడా రూపొందించవచ్చు.

మొబైల్ ముందు భాగాన ఉన్న 0.3 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో వీడియో కాలింగ్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొని రావచ్చు. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో 600MHz ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 256 MB మెమరీ లభిస్తున్నప్పటికీ ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు. 512 MB RAM ప్రత్యేకం.

డ్యూయల్ సిమ్ ఫీచర్‌తో పాటు  'ఫ్లయ్ బ్లాక్‌బర్డ్' స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 2.3.4 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని  అందించేందుకు గాను ఇందులో Lithium - ion  బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. ఇండియన్ మొబైల్ మార్కెట్లో దీని ధర సుమారుగా రూ 11, 000/- వరకు ఉండవచ్చునని అంచనా..

'ఫ్లయ్ బ్లాక్‌బర్డ్' మొబైల్ ప్రత్యేకతలు:

* Dual SIM

* Touch screen display

* Dual cameras

* 600MHz processor

* FM radio

* 3.5 mm audio jack

* Expandable memory up to 32 GB

* Wi-Fi

* Bluetooth

* WAP

* GPS

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot