ఎగిరేందుకు సిద్దమైన ఫ్లయ్ డిఎస్ 120

Posted By: Staff

ఎగిరేందుకు సిద్దమైన ఫ్లయ్ డిఎస్ 120

మొబైల్ తయారీ రంగంలో అప్పుడప్పుడు మొబైల్స్‌ని విడుదల చేస్తూ గ్లోబల్‌గా మార్కెట్‌ని సంపాదించుకున్న మొబైల్ కంపెనీ ప్లయ్. ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి ప్లయ్ కంపెనీ నుండి మరో మొబైల్ రానుంది. దానిపేరే ప్లయ్ డిఎస్ 120. ప్లయ్ డిఎస్ 120 డ్యూయల్ సిమ్స్ ఫెసిలిటీని కలిగి ఉండి కస్టమర్స్ యొక్క అభిరుచికి అనుగుణంగా తయారు చేయడం జరిగిందని తెలియజేశారు. గతంలో ప్లయ్ కంపెనీ నుండి వచ్చిన మొబైల్స్‌తో పోల్చితే ఇందులో కొన్ని ఎగస్ట్రా ఫీచర్స్‌ని యాడ్ చేయడం జరిగింది. ప్లయ్ డిఎస్ 120 యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకుగాను 2.4 ఇంచ్ QVGTA TFT డిస్ ప్లేని కలిగి ఉంది.

మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 30కెబి మొమొరీ లభిస్తుండగా మొమొరీని మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా 16జిబీ వరకు ఎక్పాండ్ చేసుకునే వెసులు బాటు కూడా ఉంది. ఇక మల్టీమీడియా, ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే 0.3 మెగా ఫిక్సల్ కలిగినటువంటి విజిఎ కెమెరాతో పాటు డిజిటల్ జూమ్, వీడియో రికార్డింగ్ దీని ప్రత్యేకం. మొబైల్ తో పాటు ఎఫ్ ఎమ్ రేడియా అదనం. ఇక ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లు MP3, WAV, MIDI, AMRలను సపోర్ట్ చేస్తుంది.

ఇక కనెక్టివిటీ, కమ్యూనికేషన్ టెక్నాలజీలైన బ్లూటూత్ వి2.0 వర్సన్ తోపాటు A2DP, HFP, FTP, OPPలను కూడా సపోర్ట్ చేస్తుంది. వై-పై లేనప్పటికీ ఇంటర్నెట్ కోసం జిపిఆర్‌ఎస్ క్లాస్ 10, WAP 2.0 లను అందిస్తుంది. బ్యాటరీ బ్యాక్ అప్ విషయంలో కూడా కస్టమర్స్‌ని నిరాశ పరచదు. బ్యాటరీ స్టాండ్ బై టైమ్ 300 గంటలు. మొబైల్‌తో పాటు స్పీకర్స్, ఛార్జర్, హెడ్ సెట్స్ ప్రత్యేకం.

ప్లయ్ డిఎస్ 120కి సంబంధించిన ధరను ఇంకా మార్కెట్లోకి వెల్లడించకపోయినప్పటికీ ఇద బేసిక్ ఫోన్‌గా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా దీని ధర కూడా సుమారుగా రూ 1,800 నుండి 3,000లోపు ఉండవచ్చునని అంచనా.. కామన్ మ్యాన్‌కి ఏఏ ఫీచర్స్‌తో మొబైల్ కావాలో అటువంటి అన్ని రకాల ఫీచర్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి మార్కెట్లో గ్యారంటీగా ఇది క్లిక్ అవుతుందని కంపెనీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot