‘ఫ్లై’ మొబైల్స్ నుంచి సరికొత్త డ్యూయల్ సిమ్ ఫోన్!

Posted By: Staff

‘ఫ్లై’ మొబైల్స్ నుంచి సరికొత్త డ్యూయల్ సిమ్ ఫోన్!

ప్రముఖ మొబైల్ బ్రాండ్ ‘ఫ్లై’ (fly) మరో సరికొత్త మోడల్ మొబైల్ ఫోన్‌తో ముందుకొచ్చింది. పేరు ‘ఈ-281 ఎన్’,ధర రూ.3,499. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానాంశంగా రూపుదిద్దుకున్న ఈ హ్యాండ్‌సెట్ మినీ థియేటర్‌లా చేతిలో ఒదిగిపోతుంది. ఈ మొబైల్‌ను పీసీ, లేదా ల్యాప్‌టాప్‌తో అనుసంధానించినప్పుడు... వెబ్ కామ్‌గా కూడా సేవలందించే సౌలభ్యం ఉండడం ఆకర్షించే మరో అంశం.

ఫోన్ ఫీచర్లు:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),

స్ర్కీన్ సైజ్ 2.8 అంగుళాలు,

20.70ఎంబీ ఇంటర్నల్ మెమెరీ,

32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,

ఫోన్‌బుక్ సామర్ధ్యం 2000 పరిచయాల వరకు,

హైస్పీడ్ ఇంటర్నెట్ ఇంటర్నట్ వయా 3జీ,

2 మెగా పిక్సల్ కెమెరా (ప్లాష్ లైట్),

ఎఫ్ఎమ్ రేడియో,

ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,

బ్లూటూత్ ఏ2డీపీ,

యూఎస్బీ పోర్ట్,

2డి నుంచి 3డి కన్వర్షన్,

1100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ( స్టాండ్ బై 150 గంటలు, టాక్ టైమ్ 7 గంటలు),

ప్రీలోడెడ్ అప్లికేషన్స్ (గూగుల్, యాహూ, ఎమ్ఎస్ఎన్, ఫేస్‌బుక్, ఓపెరా మినీ, నైంబజ్, మొబైల్ ట్రాకర్, ఈ-బడ్డీ, కింగ్ మూవీ, హ్యాండ్ రైటింగ్ రికగ్నిషన్,

బరువు 90 గ్రాములు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot