మొబైల్ ప్రేమికులకు మాత్రమే 'ప్లయ్ ఈ131'

Posted By: Staff

మొబైల్ ప్రేమికులకు మాత్రమే 'ప్లయ్ ఈ131'

ఫ్లయ్ మొబైల్స్ ఇండియన్ మొబైల్ మార్కెట్లో అందరికి ప్రయారిటీ కాకపోయిన ప్రత్యేకంగా వాటిపై దృష్టిని సారించే యూజర్స్ కొంత మంది ఉన్నారు. ఫ్లయ్ మొబైల్స్ ఎప్పుడు కూడా గ్లోబల్ మొబైల్స్ అయిన శ్యామ్‌‌సంగ్, నోకియా, సోనీ ఎరిక్సన్ లాంటి వాటికి పోటీగా ఎదురుపడ లేదు. ఇది మాత్రమే కాదండోయ్ పైన పేర్కోన్న గ్లోబల్ మొబైల్స్‌కి సంబంధించిన మోడల్స్‌ని కాపీ ఇంతవరకు కొట్టలేదు. తనకున్న నైపుణ్యంతోనే మార్కెట్లోకి కొత్త కొత్త మోడల్స్‌ని విడుదల చేస్తుంది.

ఎవరైతే యూజర్స్ ప్రత్యేకమైన ఫీచర్స్‌ని కలిగిన మొబైల్ పోన్స్‌ని కావాలని కొరుకుంటారో అటువంటి వారి కలలను తీర్చేందుకే ప్లయ్ మొబైల్స్ క్వాలిటీ ఫీచర్స్‌‌తో తక్కువ ధరలో ఫోన్స్‌ ని విడుదల చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లోకి ప్లయ్ మొబైల్స్ ఓ బడ్జెట్ ఫోన్‌ని విడుదల చేస్తుంది. దీనిపేరు ప్లయ్ ఈ131. చక్కని దృశ్యానందాన్ని కలిగింజేందుకు గాను 2.4 ఇంచ్ డిస్ ప్లేతో పాటు 240 X 320గా స్క్రీన్ రిజల్యూషన్‌ని కలిగి ఉంది. డ్యూయల్ సిమ్ విభాగంలో విడుదలవుతున్న ఈ మొబైల్‌లో విజిఎ కెమెరాని నిక్షిప్తం చేయడం జరిగింది.

వేరే మొబైల్ ఫోన్స్‌లలో ఉన్న విజిఎ కెమెరాతో పొల్చితే గనుక ఇందులో ఉన్న కెమెరా క్వాలిటీ ఇమేజిలను తీయగలుగుతుంది. దీనితోపాటు చెవులను శ్రవణానందాన్ని అందించేందుకు గాను ఇందులో ఎఫ్ ఎమ్ రేడియో అదనపు ఆకర్షణ. ప్లయ్ ఈ131లో మంచి క్వాలిటీ మ్యూజిక్‌ని అందించే మల్టీమీడియా ప్లేయర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న అన్ని రకాల ఆడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది.

మొబైల్‌తో పాటు కొంత మొమొరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 32జిబి వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది. ప్లయ్ ఈ131 మొబైల్‌లో బ్లూటూత్ అందుబాటులో ఉండడం వల్ల వేరే బ్లూటూత్ డివైజ్‌కు డేటాని ఈజీగా ట్రాన్ఫర్ చేయవచ్చు. ఇక కమ్యూనికేషన్ ఫీచర్స్ కోసం ప్రత్యేకంగా GPRS/ WAP సర్వీసెస్‌ని అందిస్తుంది. ఇందులో మరో ప్రత్యేకత ఏంటంటే యుఎస్‌బి సింక్రనైజేషన్ ఫోర్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పవర్ మేనేజ్‌మెంట్ విషయానికి వస్తే ఎక్కువ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను ఇందులో 1000mAH Li ion బ్యాటరీని పోందుపరచడం జరిగింది. ఇండియన్ మొబైల్ మార్కెట్లో దీని ధరను ఇంకా వెల్లడించ లేదు.

ప్లయ్ ఈ131 మొబైల్ ఫీచర్స్:

* 2.4 Inch Display
* 240

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting