మాస్-మసాలా ఫోన్!

Posted By: Prashanth

మాస్-మసాలా ఫోన్!

 

ప్రముఖ మొబైల్‌ఫోన్‌ల నిర్మాణ సంస్థ ‘ఫ్లై’ (Fly) తక్కువ ధరతో కూడిన ఫీచర్‌ రిచ్ డ్యూయల్ సిమ్ ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. పేరు ‘ఫ్లై ఈ281ఎన్’ (Fly E281n).డ్యూయల్ సిమ్ సపోర్ట్ జీఎస్ఎస్+ జీఎస్ఎమ్. ప్రత్యేకమైన 3డీ పీచర్‌తో డిజైన్ కాబడిన ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.3,499. పలు సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్‌లతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ అప్లికేషన్‌లను హ్యాండ్‌సెట్‌లో లోడ్ చేశారు. ఎంటర్‌టైన్‌మెంట్ అవసరాల నిమిత్తం ఫోన్‌లో 5 సినిమాలు, 25 బాలీవుడ్ వీడియోలు, 25 ప్రాంతీయ వీడియోలు, 20 ఎంపీత్రీ ట్రాక్స్‌తో పాటు 2 ఈ-పుస్తకాలు 12 వాల్ పేపర్‌లను లోడ్ చేశారు.

ప్రధాన ఫీచర్లు:

2.8 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్),

మ్యూజిక్ ప్లేయర్,

1.6 మెగాపిక్సల్ కెమెరా (ఫ్లాష్),

చుట్టుకొలత 106.2×44.6×14.8 మిల్లీమీటర్లు,

బరువు 80.8 గ్రాములు,

3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,

ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,

ఏ2డీపీ సౌలభ్యతతో కూడిన బ్లూటూత్,

32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,

3డి డెమో గ్లాసెస్,

ఆటోకాల్ రికార్డింగ్,

1000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (5 గంటల టాక్ టైమ్, 500 గంటల స్టాండ్ బై),

ప్రత్యేక ఫీచర్లు:

హ్యాండ్ రైటింగ్ గుర్తింపు, ఫన్‌టచ్ గేమ్ స్టేషన్స్, హై రేట్ కంప్రెషన్ వీడియో ఫార్మాట్‌తో కూడిన మూవీ ప్లేయర్, స్మార్ట్ ఆటో కాల్ రీడర్, స్టైలస్ పెన్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot