సంచలనం సృష్టించడానికే 'ఫ్లయ్ ఈ 321'

Posted By: Staff

సంచలనం సృష్టించడానికే 'ఫ్లయ్ ఈ 321'

ఫ్లయ్ మొబైల్స్ కొత్త ఆలోచనలతో కొత్త మొబైల్స్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా మార్కెట్లోకి ఓ సరిక్రొత్త బార్ ఫోన్‌తో వచ్చింది. ఫ్లయ్ మొబైల్స్ మార్కెట్లోకి విడుదల చేయనున్న ఈ మొబైల్ పేరు 'ఫ్లయ్ ఈ 321'. దీని బరువు 125 గ్రాములు. ఫ్లయ్ ఈ 321 మొబైల్‌లో ఉన్న ముఖ్యమైన ఫీచర్ పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్. అందుకే ఇందులో Li-Ion 1200 mAh బ్యాటరీని నిక్షిప్తం చేశారు. దీంతో ఈ మొబైల్ టాక్ టైమ్ 10గంటల 20నిమిషాలు. స్టాండ్ బై టైమ్ 22గంటలు.

యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని స్క్రీన్ సైజు 3.2 ఇంచ్ HVGA, TFT కాగా, చుట్టుకొలతలు 112 x 58.6 x 11.6m. 3డి సౌండ్ ఎఫెక్టుతో యూజర్స్‌ని ఆశ్చర్యపరుస్తుంది. ఇక ఫ్లయ్ మొబైల్స్ ఎల్లప్పుడూ కూడా డ్యూయల్ సిమ్ ఫోన్స్‌కి పెట్టింది పేరు. ఇక మొబైల్ వెనుక భాగాన ఉన్న 2.0మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో 1600 x 1200 ఫిక్సల్ రిజల్యూషన్ కలిగిన ఇమేజిలను తీయవచ్చు. డిజిటల్ జూమ్ ప్రత్యేకం.

ఈ మొబైల్‌లో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే మీకు నచ్చిన సాంగ్స్, వీడియోస్, సినిమాలన్నింటిని కూడా ఇందులో స్టోర్ చేసుకొవచ్చు. మొబైల్‌తో పాటు కొంత మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రోఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకోవచ్చు. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ అయిన పేస్‌బుక్, ఈబుడ్డీ లాంటి వాటికి కనెక్ట్ అయ్యేందుకు గాను స్పెషల్ బటన్‌ని రూపొందించడం జరిగింది. వీటితో పాటు ఈ మొబైల్‌లో యాంగ్రీ బర్డ్, ట్రిస్ అప్లికేషన్స్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది.

ఎంటర్టెన్మెంట్ విషయానికి వస్తే ఎఫ్‌ఎమ్ రేడియో ఫీచర్ ప్రత్యేకం. ఇందులో ఉన్న మ్యూజిక్ ప్లేయర్ సహాయంతో అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను ప్రదర్శించవచ్చు. మొబైల్‌తో పాటు లభించే 3.5mm జాక్‌తో బయట స్పీకర్స్‌కు కనెక్ట్ చేయవచ్చు. బ్లూటూత్, యుఎస్‌బి పోర్టులు ప్రత్యేకం. ఇండియన్ మొబైల్ మార్కెట్లో దీని ధర సుమారుగా రూ 4,000గా ఉండవచ్చునని నిపుణుల అంచనా..

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot