బ్రాండ్ అదిరింది..గిరాకీ పెరగింది...?

Posted By: Prashanth

బ్రాండ్ అదిరింది..గిరాకీ పెరగింది...?

 

ఉత్తమ క్వాలిటీ మొబైల్ బ్రాండ్ ‘ఫ్లై’ (FLY) జీఎస్ఎమ్ ఆధారిత డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్‌ను త్వరలో ఆవిష్కరించనుంది. ‘ఫ్లై MV242’ నమూనాలో విడుదలకాబోతున్న ఈ డివైజ్ ఇ-బుక్ రీడర్, ఇమేజ్ వ్యూవర్, LED టార్చ్ , ఆటో కాల్ రికార్డింగ్ వంటి ఆధునిక ఫీచర్లు ఒదిగి ఉంది.

క్లుప్తంగా ఫోన్ ఫీచర్లు:

* 2.4 అంగుళాల టచ్ స్ర్కీన్,

* 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

* క్వాలిటీ వీడియో రికార్డింగ్,

* 233కెబీ ఇంటర్నల్ మెమెరీ,

* 32జీబి ఎక్సటర్నల్ మెమరీ మైక్రో ఎస్డీ క్లార్ స్లాట్ సపోర్ట్ ద్వారా,

* జీపీఆర్ఎస్ సపోర్ట్,

* బ్లూటూత్ కనెక్టువిటీ,

* జీపీఎప్ ఫెసిలిటీ,

* 2జీ,3జీ నెట్‌వర్క్ సపోర్ట్,

* ఉత్తమ క్వాలిటీ ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో,

* బ్యాటరీ స్టాండ్ బై 400 గంటలు, టాక్ టైమ్ 10 గంటలు,

* జావా ఆపరేటింగ్ సిస్టం,

గుగూల్, యాహూ వంటి వెబ్ అప్లికేషన్‌లను ముందుగానే ఫోన్‌లో లోడ్ చేశారు. యూజర్ ఫ్రెండ్లీ లక్షణాలతో ఆధునిక శైలిలో రూపుదిద్దుకున్న ఫ్లై MV242 అతి త్వరలోనే గ్యాడ్జెట్ స్టోర్‌లలో లభ్యం కానుంది. ధర వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot