ప్లయ్ టివి మొబైల్ విడుదల...

Posted By: Super

ప్లయ్ టివి మొబైల్ విడుదల...

యూరోపియన్ మొబైల్ కంపెనీ ప్లయ్ మొబైల్స్ మొబైల్ వరల్డ్ లోకి కొత్త ఫ్యాషనబుల్, స్టయిలిష్ మొబైల్ ఫోన్ 'ప్లయ్ క్యూ120 టివి'ని విడుదల చేయనుంది. ప్లయ్ క్యూ120 టివి మొబైల్ ఫోన్ డ్యూయల్ సిమ్ ఫీచర్‌తో పాటు క్వర్టీ కీప్యాడ్ దీని సొంతం. ప్లయ్ మొబైల్స్ గతంలో చాలా డ్యూయల్ సిమ్ మొబైల్స్‌ని విడుదల చేసినప్పటికీ ఇందులో కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్‌ని ఇమడింపజేయడం జరిగింది. డ్యూయల్ సిమ్ ఫీచర్‌, క్వర్టీ కీప్యాడ్ ఫీచర్స్‌తో ప్లయ్ మొబైల్స్ విడుదల చేసిన అన్ని మొబైల్స్‌లలో కెల్లా ఇది చాలా తక్కువ ధరను కలిగి ఉంది.

ఇక ప్లయ్ క్యూ120 టివి ఫీచర్స్ గమనిస్తే చుట్టుకొలతలు 112.6 x 62.5 x 2.6 mmగా ఉండి, 95 గ్రాముల బరువుని కలిగి ఉండి యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను స్క్రీన్ సైజు 2.0 ఇంచ్‌గా రూపోందిచబడింది. ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో కెమెరా లేని మొబైల్స్‌పై యూజర్స్ పెద్దగా ఆసక్తిని కనబరచడం లేదు. ప్లయ్ క్యూ120 టివి మాత్రం 0.3 మెగా ఫిక్సల్ విజిఎ కెమెరాతో పాటు డిజిటల్ జూమ్‌ని కలిగి ఉంది. యూజర్స్ ఇందులో ఉన్న కెమెరా సహాయంతో QCIF (176 x 220 pixels) వీడియో రికార్డింగ్‌ని నమోదు చేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న MP4, 3GP, Sound Coding AMR, WAV లాంటి ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది.

మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా కొంత మొమొరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా 32జిబి వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది. కమ్యూనికేషన్, కనెక్టివిటీ టెక్నాలజీలైన బ్లూటూత్ లను సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు ఇందులో ఉన్న జిపిఆర్‌ఎస్ మోడమ్ సహాయంతో యూజర్స్ చక్కని బ్రౌజింగ్ ఎక్స్ పీరియన్స్‌ని కూడా పొందవచ్చు. బ్యాటరీ బ్యాక్ అప్ విషయానికి వస్తే ఇందులో 900 mAh Li-Ion బ్యాటరీని నిక్షిఫ్తం చేయడం జరిగింది. ఈ బ్యాటరీ టాక్ టైమ్ 3 గంటలు రాగా, స్టాండ్ బై టైమ్ కెపాసిటీ 360 గంటలుగా వస్తుందని తెలిపారు.

ఇండియన్ కండిషన్స్‌లో ప్లయ్ క్యూ120 టివి మొబైల్ హై పెర్పామెన్స్‌ని ప్రదర్శిస్తుందని అన్నారు. ఇందులో మ్యూజిక్ ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్‌ఎమ్ రేడియో లాంటి అధనపు ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇన్ని అత్యాధునికమైన ఫీచర్స్ ఉన్న ప్లయ్ క్యూ120 టివి ఫోన్ ధర కేవలం రూ 3000 మాత్రమే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot