Just In
- 6 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 7 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 10 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- 13 hrs ago
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
భూమిపై అత్యధిక కాలంగా జీవిస్తున్న కుక్కగా ‘బోబీ’ గిన్నీస్ వరల్డ్ రికార్డ్
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Movies
Pathaan Day 9 Collections: తగ్గుముఖం పడుతున్న షారుక్ 'పఠాన్'.. 9వ రోజు వసూళ్లు ఎంతో తెలిస్తే?
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఆపిల్ అభిమానులు రెడీనా, మడిచిపెట్టుకునే ఫోన్లు వస్తున్నాయి !
ఐఫోన్ ప్రియులకు కంపెనీ శుభవార్తను అందించింది. ఆపిల్ నుంచి భవిష్యత్తులో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ చూసే అవకాశం కలగనుంది. ఆపిల్ సంస్థ త్వరలో ఫోల్డబుల్ (మడతబెట్టే) ఐఫోన్‌ను తయారుచేస్తుందట. 2020వ సంవత్సరంలో ఈ ఫోల్డబుల్ ఐఫోన్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ ఫోల్డబుల్ ఐఫోన్ తయారీ కోసం ప్రత్యేకమైన బృందాన్ని కూడా ఆపిల్ నియమించిందట. వారు ఈ ఫోన్‌ను తయారు చేయనున్నట్లు తెలిసింది. ఇక ఫోల్డబుల్ ఐఫోన్‌లలో ఉండే డిస్‌ప్లేలను ఎల్‌జీ సంస్థ తయారు చేసి ఆపిల్‌కు ఇవ్వనున్నట్లు తెలిసింది. అయితే దీనిపై ఆపిల్ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు. ఇవన్నీ ఇంటర్నెట్ ప్రపంచంలో వస్తున్న ఊహాగానాలే. మరి ఈ వార్త నిజమవుతుందో లేదో వేచి చూస్తే తెలుస్తుంది.

ఆసియాకు చెందిన భాగస్వాములతో..
ఆసియాకు చెందిన భాగస్వాములతో కలసి ఫోల్డబుల్ ఐఫోన్ ను అభివృద్ధి చేసే పనిలో ఆపిల్ ఉందని బ్యాంకు ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ అనే సంస్థ స్వయంగా తెలిపింది. ఈ మేరకు తన క్లయింట్లకు ఆపిల్ సంస్థ భవిష్యత్తుపై పరిశోధన కథనం (యాపిల్ అమెరికాలో లిస్టెడ్ కంపెనీ) అందించింది.

ఫోల్డబుల్ ఐఫోన్ కు సంబంధించి..
ఫోల్డబుల్ ఐఫోన్ కు సంబంధించి సరఫరాదారులతో ఆపిల్ చర్చిస్తున్నట్టు తమకు సంకేతాలు ఉన్నాయని అందులో తెలిపింది. ఫోల్డబుల్ ఓఎల్ఈడీ ప్యానళ్లను వాడనున్నట్టు, 2020 నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుందని అంచనా వేసింది.

శాంసంగ్, లెనోవో సంస్థలు సైతం..
కాగా శాంసంగ్, లెనోవో సంస్థలు సైతం ఫోల్డబుల్ ఫోన్లను తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నాయి. ఇప్పటికే ప్రయోగాలు కూడా నిర్వహించాయి. కొన్ని కంపెనీలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో తమ పోల్డబుల్ ఫోన్లను ఇప్పటికే ప్రదర్శించాయి కూడా. శాంసంగ్ గెలాక్సీ ఎక్స్ కాన్సెప్ట్ ఫోన్ ఇప్పటికే మార్కెట్లో చక్కర్లు కొడుతోంది.

వచ్చే తరం ఐఫోన్లు, ఐప్యాడ్లు..
వచ్చే తరం ఐఫోన్లు, ఐప్యాడ్లు అన్నీ బ్లెండబుల్ గానే ఉంటాయని రిపోర్టులు తెలియజేస్తున్నాయి. సౌత్ కొరియాకు చెందిన ఇన్వెస్టర్ ఈ రకమైన ఫోన్లను ఆపిల్ తయారుచేసేపనిలో బిజీగా ఉందని తొలిసారిగా లీకులు అందించాడు. ఆపిల్ కంపెనీ తమ ఫోల్డబుల్ ఫోన్ల కోసం ఎల్‌జి డిస్‌ప్లేని వాడుకునే అవకాశం ఉందని కూడా రిపోర్టులు చెబుతున్నాయి.

LED display రంగంలో ..
కాగా మార్కెట్లో ఇప్పుడు LED display రంగంలో శాంసంగ్, ఎల్‌జి కంపెనీలు టాప్ పొజిషన్లో దూసుకుపోతున్నాయి. ఆపిల్ కూడా ఈ రకమైన తయారీలో ముందు వరుసలో దూసుకుపోయేందుకు రెడీ అయినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఆపిల్ నుంచి వచ్చే ప్రకటన కోసం..
ఈ విషయాన్ని Samsung's mobile chief, DJ Koh కూడా తెలిపారు. ఆపిల్ నుంచి రానున్న ఈ ఫోల్డబుల్ ఫోన్ మీద కొన్ని విషయాలు మాత్రమే లీకయ్యాయి. మరిన్ని విషయాలు తెలియాలంటే ఆపిల్ నుంచి వచ్చే ప్రకటన కోసం వేచి చూడాల్సిందే. కాగా ఆపిల్ కంపెనీ మాత్రం ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుతోంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470