మైక్రోమాక్స్ చైర్మన్‌గా ఎయిర్‌టెల్ మాజీ సీఈఓ

Posted By:

దేశవాళీ స్మార్ట్ ఫోన్ ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ తమ కంపెనీని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంతో దిగ్గజాలను వెతుకేపనిలో పడింది. వారం రోజుల క్రిందటే సామ్ సంగ్ ఇండియా మొబైల్ అధిపతిని తమ కంపెనీ సీఈఓగా నియమించుకున్న మైక్రోమాక్స్ తాజాగా తమ సంస్థ ఛైర్మన్ స్థానంలో ఎయిర్‌టెల్ మాజీ సీఈఓ సంజయ్ కపూర్‌ను కూర్చోబెట్టింది.

మైక్రోమాక్స్ చైర్మన్‌గా ఎయిర్‌టెల్ మాజీ సీఈఓ

ఎయిర్‌టెల్ సీఈఓ పదవికి సంజయ్ కపూర్ గతేడాది మే నెలలో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన మైక్రోమాక్స్ ప్రమోటర్ గ్రూపులో చేరారు. స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం రోజురోజుకు పెరుగుతోన్న నేపధ్యంలో సంజయ్‌కు ఉన్న అంతర్జాతీయ స్థాయి అనుభవం తమ కంపెనీకి మరింత తోడ్పడుతుందని మైక్రోమాక్స్ థీమా వ్యక్తం చేస్తోంది.

సామ్‌సంగ్ ఇండియా ఐటీ, మొబైల్ వ్యాపార విభాగాలకు సీఈఓగా వ్యవహరించి ఇటీవల ఆ పదవి నుంచి వైదొలగిన వినీత్ తనీజా మైక్రోమాక్స్ కంపెనీ సీఈఓగా నియామకమయ్యారు. భారతదేశపు రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ మైక్రోమాక్స్ తమ కంపెనీ నూతన సీఈఓగా వినీత్ తనీజాను నియమిస్తున్నట్లు ప్రకటించింది. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల బ్రాండ్ విలువను రెట్టింపు చేయటంలో వినీత్ తనీజా పూర్తిస్థాయిలో విజయవంతమయ్యారు. ఆయన ట్రాక్ రికార్డును దృష్టిలో ఉంచుకుని మైక్రోమాక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమా‌చారం. వినీత్ తనీజా, సంజయ్ కపూర్ ఆధ్వర్యంలోని మైక్రోమాక్స్ రానున్న కాలంలో ఏ విధమైన రికార్డులను తిరగరాస్తుందో వేచి చూడాలి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting