కొత్త స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రాబోతుంది!

Posted By:

యాపిల్ కంపెనీ మాజీ సీఈఓ జాన్ స్కల్లీ భారత్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ను ఆవిష్కరించనున్నట్లు వెబ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్ డివిజన్‌‍కు నాయకత్వం వహిస్తున్న అజయ్ శర్మ ఈ బ్రాండ్‌కు నేతృత్వం వహించనున్నారు. అజయ్ శర్మకు హెచ్‌టీసీ ఇండియా హెడ్‌గా కొనసాగిని అనుభవం కూడా ఉంది. ఈ బ్రాండ్‌కు సంబంధించి పేరు ఖరారు కావల్సి ఉంది.

కొత్త స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రాబోతుంది!

ఈ సిరీస్ నుంచి స్మార్ట్‌ఫోన్‌లతో పాటు పలు ఫీచర్ ఫోన్‌లను విడుదల చేయనున్నారు. ఈ కొత్త బ్రాండ్ నుంచి ఏప్రిల్ మొదటి వారంలో తొలి డివైస్ ఆవిష్కరణ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌ల ధరలు రూ.5,000 నుంచి రూ.10,000 మధ్య ఉంటాయి.

సింగపూర్‌కు చెందిన ప్రముఖ కంపెనీ ఇన్‌ఫ్లెక్సియోన్‌పాయింట్ ఈ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌కు నిధులు సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల రూపకల్పనకు సంబంధించి అజయ్ శర్మ ఇప్పటికే ఓ కోర్ బృందాన్ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot