ఫాక్స్‌కాన్ కంపెనీలో ఐఫోన్ 5సీ ఉత్పత్తిని నిలిపివేసిన యాపిల్!
ఫేలవమైన అమ్మకపు రేటు కారణంగా యాపిల్ కార్పొరేషన్ చైనాలోని ఫాక్స్‌కాన్ కంపెనీలో ‘ఐఫోన్ 5సీ' ఉత్పత్తిని నిలిపివేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తదుపరి చర్యంగా ఐఫోన్ 5ఎస్ ఉత్పత్తి పై యాపిల్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. యాపిల్, ఇటీవల ఐఫోన్ 5సీ, ఐఫోన్ 5ఎస్ స్మార్ట్ ఫోన్ లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది.

అత్యాధునిక ఫీచర్లతో విడుదలైన ఐఫోన్ 5ఎస్ మార్కెట్లో విజయకేతనం ఎగరవేసింది. దంతో యాపిల్ కార్పొరేషన్ ఐఫోన్ 5సీ ఉత్పత్తిని తగ్గించి, ఐఫోన్ 5ఎస్ ఉత్పత్తిని పెంచాలని చూస్తోంది. యాపిల్ తన తాజా ఆవిష్కరణలైన ఐఫోన్ 5ఎస్, ఐఫోన్5సీలను ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఐఫోన్ 5సీ (16జీబి) వర్షన్ రూ.41,000, 32జీబి వర్షన్ ధర రూ.53,500. ఐఫోన్5ఎస్ (16జీబి) వర్షన్ ధర రూ.53,500, 32 జీబి వర్షన్ ధర రూ.63,500, 64జీబి వర్షన్ ధర రూ.71,500.
ఐఫోన్ 5ఎస్ కీలక స్పెసిఫికేషన్‌లు: 4 అంగుళాల రెటీనా మల్టీటచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1136*640పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్7 ఆపరేటింగ్ సిస్టం, ఫోన్ బరువు 112 గ్రాములు, ఏ7 చిప్ 64- బిట్ ఆర్కిటెక్షర్, ఎమ్7 మోషన్ ప్రాసెసర్, ఇంటర్నల్ మెమరీ 16/32/64జీబి, జీపీఎస్, గ్లోనాస్, డిజిటల్ కంపాస్, వై-ఫై, సెల్యులర్, బ్లూటూత్, సిరి, 8 మెగా పిక్పల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా. ఐఫోస్ 5సీ కీలక స్పెసిఫికేషన్‌లు: పటిష్టమైన పాలికార్బొనేట్ ప్లాస్టిక్ డిజైనింగ్,4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 640 x 1136పిక్సల్స్), యాపిల్ ఏ6 చిప్‌సెట్, ఐఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం (200 కొత్తఫీచర్లను సపోర్ట్ చేస్తుంది), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 100 ఎంబీపీఎస్ ఎల్‌టీఈ కనెక్టువిటీ, వై-ఫై ఏ/బి/జి/ ఎన్, బ్లూటూత్ 4.0.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications