Just In
- 5 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 6 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 9 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- 11 hrs ago
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Sports
భారత్ తొండాట ఆడకుంటే ఆస్ట్రేలియాదే విజయం: మాజీ క్రికెటర్
- News
Telangana gets zero: సిటీలో మోడీ లక్ష్యంగా బీఆర్ఎస్ భారీ పోస్టర్లు!
- Movies
Pathaan Day 9 Collections: తగ్గుముఖం పడుతున్న షారుక్ 'పఠాన్'.. 9వ రోజు వసూళ్లు ఎంతో తెలిస్తే?
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాటరీ బ్యాకప్‌ను పెంచేందుకు బెస్ట్ అప్లికేషన్స్
మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ద్వారా మరిన్ని అనుభూతులను ఆస్వాదించేందుకు లక్షలాది ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు గూగుల్ ప్లే స్టోర్‌లో కొలువుతీరి ఉన్నాయి. వీటిలో నచ్చిన వాటిని డౌన్‌లోడ్ చేసుకుని తరచూ ఉపయోగించటం ద్వారా బ్యాటరీ బ్యాకప్ త్వరగా తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి, ఆండ్రాయిడ్ యూజర్లు ఈ విషయం పై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాటరీ బ్యాకప్ పొదుపు అనే అంశం పై వినియోగదారులకు అవగాహన కలిగించే క్రమంలో ‘టాప్-5 బ్యాటరీ సేవింగ్' అప్లికేషన్‌లను గిజ్‌బాట్ మీ ముందు పొందుపరిచింది. ఆ వివరాలు ఫోటో గ్యాలరీ రూపంలో....

ఈజీ బ్యాటరీ సేవర్
ఈజీ బ్యాటరీ సేవర్:
ఈ పవర్ సేవర్ అప్లికేషన్ నాలుగు ప్రీసెట్ మోడ్‌లను కలిగి ఉంటుంది. వీటిని ఆన్ చేసుకోవటం ద్వారా నెట్‌వర్క్ కనెక్టువిటీ, స్ర్కీన్ బ్రైట్‌నెస్, స్ర్కీన్ టైమ్ అవుట్ వంటి అంశాలు నియంత్రణలో ఉంటాయి. తద్వారా బ్యాటరీ శక్తి కొంత మేర ఆదా అవుతుంది. డౌన్ లోడ్ చేసేందుకు క్లిక్ చేయండి.

జ్యూస్ డిఫెండర్ బ్యాటరీ సేవర్:
జ్యూస్ డిఫెండర్ బ్యాటరీ సేవర్:
ఈ అప్లికేషన్ మీ బ్యాటరీ బ్యాకప్ పెరుగుదలకు మరింత దోహదపడుతుంది. అధిక బ్యాటరీ శక్తిని వినియోగించుకునే వై-ఫై, 3జీ, 4జీ వంటి ఫీచర్లను అవసరం మేరకు మాత్రమే ఉపయోగించుకునేలా చేస్తుంది. బ్యాటరీ శక్తిని ఏ మాత్రం వృధాకానివ్వదు. డౌన్ లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి:

బ్యాటరీ డీఆర్ సేవర్
బ్యాటరీ డీఆర్ సేవర్:
ఈ అప్లికేషన్ ఫోన్ బ్యాటరీ శక్తిని ఆదా చేయటంతో పాటు డివైజ్ వేగవంతంగా రన్ అయ్యేలా చేస్తుంది. బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, స్ర్కీన్ బ్రైట్‌నెస్ వంటి అంశాలను ఎప్పటికప్పుడు ఆడ్జస్ట్ చేస్తుంది. డౌన్ లోడ్చేసుకునేందుకు క్లిక్ చేయండి.

గ్రీన్ పవర్ ఫ్రీ బ్యాటరీ సేవర్
గ్రీన్ పవర్ ఫ్రీ బ్యాటరీ సేవర్:
ఈ పవర్ సేవింగ్ అప్లికేషన్‌ను ఒక్కసారి కాన్ఫిగర్ చేసుకుంటే చాలు. తనతంటదే పనిచేయటం ప్రారంభిస్తుంది. ఏ విధమైన సూచనలు చేయనవసరం లేదు. బ్యాటరీ శక్తిని ఏమాత్రం వృధా కానివ్వదు అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఈ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది. డౌన్ లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.
https://play.google.com/store/apps/details?id=org.gpo.greenpower&feature=search_result#?
t=W251bGwsMSwxLDEsIm9yZy5ncG8uZ3JlZW5wb3dlciJd

బ్యాటరీ బూస్టర్
బ్యాటరీ బూస్టర్:
ఈ బ్యాటరీ బూస్టర్ అప్లికేషన్ బ్యాటరీ రన్ టైమ్‌ను మరింత పెంచుతుంది. ఫోన్‌లోని ప్రతి ప్రోగ్రామ్ ఎంతెంత శక్తిని వినియోగించుకుంటుంది అన్న అంశం పై ఖచ్చితమైన అవగాహనను ఈ అప్లికేషన్ కల్పిస్తుంది. డౌన్ లోడ్ చేసేందుకు క్లిక్ చేయండి.
మీ కంప్యూటర్ నెమ్మదైన పనితీరు చికాకు కలిగిస్తుందా..?, ఫైల్స్ ఓపెన్ కాక గంటల తరబడి సమయాన్ని వృధా చేస్తున్నారా..?, ఈ సమస్యకు చెక్‌పెట్టే సమయం ఆసన్నమైంది. ముందుగా మీ పీసీలోని ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేసుకుని కింద పేర్కొన్న సూచనలను పాటించగలరు... అనవసరమైన ప్రోగ్రామ్‌లను రిమూవ్ లేదా అన్-ఇన్ స్టాల్ చేయండి: ముందుగా మీరు ఉపయోగించని అనవసర సాఫ్ట్‌వేర్‌లను పీసీ నుంచి రిమూవ్ లేదా అన్-ఇన్‌స్టాల్ చేయండి. ఈ చర్య వల్ల పీసీ హార్డ్‌డ్రైవ్‌లో మరింత స్పేస్ ఏర్పడుతుంది.
వైరస్‌తో పాటు కుకీలను తొలగించడి: పీసీ వేగాన్ని తగ్గించటంలో కుకీలతో పాటు టెంపరరీ ఇంటర్నెట్ ఫైళ్లు కీలక పాత్రపోషిస్తాయి. కాబట్టి.. వీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. యాంటీ వైరస్ అప్‌డేట్‌ను రెగ్యులర్‌గా పొందుతూ పీసీని స్కాన్ చేసుకోవాలి. రీసైకిల్ బిన్‌ను ఖాళీ చేయండి: మీరు డిలీట్ చేసిన అనవసర ఫైళ్లు, ఫోల్డర్లు రిసైకిల్ బిన్‌లోకి చేరతాయి. నిర్లక్యంగా భావించకుండా ఎప్పటికప్పుడు రీసైకిల్ బిన్‌ను ఖాళీ చేసుకోవటం వల్ల పీసీ వేగం మెరుగుపడటంతో పాటు హార్డ్‌డ్రైవ్‌లో కొంత స్పేస్ ఏర్పడుతుంది. ప్రారంభ ప్రోగ్రామ్‌లను తగ్గించండి: పీసీ స్టార్ట్‌అప్‌లో భాగంగా అనేక ప్రోగ్రామ్‌లు లోడవుతుంటాయి. ఈ చర్య కంప్యూటర్ వేగాన్ని మందగించేలా చేస్తుంది. అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోండి: విండోస్ ఆపరేటింగ్ సిస్టం మరింత మెరుగ్గా పనిచేసేందుకు మైక్రోసాఫ్ట్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను ప్రవేశపెడుతుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470