బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ!

కారుచౌక ఫోన్‌లను అనౌన్స్ చేసి వివిదాల్లో కూరుకుపోయిన కొత్త బ్రాండ్స్.

|

రూ.2500కు కూడా గిట్టుబాటు కాని ఫోన్‌లను కేవలం రూ.250, రూ.500కే ఇస్తామంటూ కొన్ని బ్రాండ్‌లు ఈ ఏడాది మార్కెట్లో హల్‌చల్ చేసాయి. వేల రూపాయలు విలువ చేసే వస్తువు, వందల్లోనే వస్తుందనగానే చాలా మంది యూజర్లు ఈ కారుచౌక ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు.

బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ!

Read More : ఫోన్‌లో బంగారం ఎక్కడుంటుంది?, ఎలా బయటకు తీస్తారు?

తీరా రీయాల్టీలోకి వచ్చేసరికి ఈ బ్రాండ్‌లు చేతులెత్తేసాయి. బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అన్నచందాన వ్యవహరించిన ఈ కంపెనీలు జనాన్ని ఊరించి ఉసూరుమనిపించేలా చేసాయి. కారుచౌక ఫోన్‌లను అనౌన్స్ చేసి వివిదాల్లో కూరుకుపోయిన పలు స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..

మొబైల్ ప్రపంచాన్ని షాకింగ్‌కు గురిచేస్తూ..

మొబైల్ ప్రపంచాన్ని షాకింగ్‌కు గురిచేస్తూ..

ఈ ఏడాది ఫిబ్రవరిలో మొబైల్ ప్రపంచాన్ని షాకింగ్‌కు గురిచేస్తూ 251కే స్మార్ట్‌ఫోన్ అంటూ దూసుకొచ్చిన రింగింగ్ బెల్స్ కంపెనీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ప్రపంచదేశాలకు సైతం దిమ్మతిరిగేలా చేసిన రింగింగ్ బెల్స్ మేక్ ఇన్ ఇండియా ఫోన్ అంటూ ఊదరగొట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అది ఇప్పుడు పత్తా లేకుండా పోయింది. రూ. 251కే ఫోనంటూ జనాలను నమ్మించిన రింగింగ్ బెల్స్ సంస్థ తర్వాత పలు వివాదాల్లో చిక్కుకుంది.

ఒక్క ఫోన్ కూడా డెలివరీ కాలేదు...

ఒక్క ఫోన్ కూడా డెలివరీ కాలేదు...

అయితే ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఫోన్ కూడా డెలివరీ చేయలేదు. దీంతో
రింగింగ్ బెల్స్ తీరు 2016 లో అతిపెద్ద 'టెక్ డిసప్పాయింట్మెంట్'గా మిగిలిపోయింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంస్థపై నమ్మకం లేదనడానికి..
 

సంస్థపై నమ్మకం లేదనడానికి..

ఫ్రీడం ఫోన్లను బుక్ చేసిన వారు కూడా అంత సీరియస్‌గా తీసుకోలేదని, 'ట్రై చేసి చూద్దాం' అన్నట్టుగానే ఫోన్లను బుక్ చేశారని, సంస్థపై నమ్మకం లేదనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరిలో కంపెనీ చేసిన ప్రకటనకు దాదాపు ఏడుకోట్లమంది ఈ ఫోన్ కోసం రిజిస్ట్రర్ చేసుకున్నారు. కాని వారు ఇంతవరకు వాటిని సాధించలేదు.

ఛాంప్1ఇండియా

ఛాంప్1ఇండియా

ఫ్రీడం 251 తరువాత ఛాంప్1ఇండియా అనే మరో కంపెనీ కంపెనీ రూ.501కే బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామంటూ మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఈ ఫోన్‌లకు సంబంధించిన మొదటి సేల్ సెప్టంబర్ 2న జరుగుతుందని లాంచ్ సమయంలో ఛాంప్1ఇండియా ప్రకటించినప్పటికి అది జరగలేదు. అయితే, ఈ ఫోన్‌లకు సంబంధించిన మొదటి సేల్ నవంబర్ 18న జరిగినట్లు వార్తలు వచ్చాయి.

అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..

అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..

ఆర్డర్ చేసుకున్న వారికి ఈ ఫోన్‌లు డెలివరీ అయ్యాయా..?, లేదా అన్నది మాత్రం ఇంకా స్ఫష్టత లేదు. ఫ్రీడం 251 మాదిరిగానో ChampOne C1 ఫోన్ పై కూడా అనేక అనుమానాలను నిపుణులు వ్యక్తపరుస్తున్నారు.

ఛాంప్1ఇండియా సంస్థ చెబుతోన్న లెక్కల ప్రకారం..

ఛాంప్1ఇండియా సంస్థ చెబుతోన్న లెక్కల ప్రకారం..

ఛాంప్1ఇండియా సంస్థ చెబుతోన్న లెక్కల ప్రకారం ఈ ఫోన్ వాస్తవ ధర రూ.7,999గా ఉందట. అయితే, లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ లో భాగంగా రూ.599కే అందించే ప్రయత్నం చేస్తున్నారట. ఛాంప్‌వన్ సీ1 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ 5 అంగుళాల 720 పిక్సల్ డిస్‌ప్లే, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6735 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జైపూర్‌కు చెందిన Docoss

జైపూర్‌కు చెందిన Docoss

జైపూర్‌కు చెందిన Docoss కంపెనీ రూ.888కే స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామంటూ హాట్ టాపిక్ అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్ ముందస్తు బుకింగ్‌లను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినప్పటిని వెబ్‌సైట్ మాత్రం పనిచేయ లేదు. దీంతో Docoss X1 ఫోన్ ను ఫ్రీడమ్ 251 తరహాలో ఫేక్ బ్రాండ్‌గానే నిపుణులు లెక్కగట్టారు.

Docoss X1 ఫోన్ స్పెసిఫికేషన్స్..

Docoss X1 ఫోన్ స్పెసిఫికేషన్స్..

ఫోన్ స్పెసిఫికేషన్స్.. 4 అంగుళాల WVGA ఐపీఎస్ డిస్‌ప్లే, 1.2గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ, డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్ + డబ్ల్యూసీడీఎమ్ఏ), జీపీఆర్ఎస్ కనెక్టువిటీ, 1300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్
4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం.

Vobizen Wise 5

Vobizen Wise 5

కోయంబత్తూరుకు చెందిన వోబిజెన్ మొబైల్స్ అనే కంపెనీ Vobizen Wise 5 పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను అనౌన్స్ చేసింది. ధర రూ.499. యునికోయిడ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే ఆన్‌లైన్ సెల్లర్ ద్వారా ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తున్నట్లు సంస్థ వెబ్‌సైట్ చెబుతోంది. వాస్తవానికి ఈ ఫోన్ ధర రూ.3,499 అట. ప్రత్యేక డిస్కౌంట్ పై రూ.499 ధర ట్యాగ్‌తో విక్రయిస్తున్నట్లు సంస్థ చెబుతోంది.

ఫోన్‌ను ఆర్డర్ చేసుకున్న వారికి

ఫోన్‌ను ఆర్డర్ చేసుకున్న వారికి

ఫోన్‌ను ఆర్డర్ చేసుకున్న వారికి 22 నుంచి 28 రోజుల్లో ఫోన్ డెలివరీ ఉంటుందని Vobizen వెబ్ సైట్ చెబుతోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్‌ను బుక్ చేసుకునే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఫోన్ ఆన్‌లైన్ ఛానల్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అందుబాటులో లేదు.

Vobizen Wise 5 స్పెసిఫికేషన్స్

Vobizen Wise 5 స్పెసిఫికేషన్స్

గ్రే, ఎల్లో ఇంకా వైట్ కలర్ ఆప్షన్ లలో అందుబాటులో ఉండే Vobizen Wise 5 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి.. 5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్854x 480పిక్సల్స్), 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2000 ఎమ్ఏహెచ్

బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 3జీ, బ్లుటూత్, వై-ఫై, యూఎస్బీ 2.0 పోర్ట్, ఎన్ఎఫ్ సీ, జీపీఎస్, ఎఫ్ఎమ్ రేడియో, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ప్రాక్సిమిటీ సెన్సార్).

 

ఫ్రీడమ్651..

ఫ్రీడమ్651..

251 రూపాయలకే స్మార్ట్‌ఫోన్ ఇస్తామంటూ ప్రకటించిన రింగింగ్ బెల్స్ సంస్థను ఎద్దేవా చేస్తూ ఒక కొత్త వెబ్‌సైట్ వచ్చింది. దాని పేరు ఫ్రీడమ్651.కామ్. అచ్చం ఫ్రీడమ్ 251 సైట్‌లాగే తమది కూడా రూపొందించి, దాంట్లో 'డజ్‌నాట్ రింగ్ బెల్స్ ప్రైవేట్ లిమిటెడ్) అని
పేర్కొన్నారు. అచ్చు గుద్దినట్లు దానిలాగానే ఈ సైట్ కూడా ఉంది.

650 రూపాయలు కడితే..

650 రూపాయలు కడితే..

తాము శివకాశిలోని స్టాండర్డ్ ఫైర్‌వర్క్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నామని, 2 కోట్ల రాకెట్లు చేసి, మనుషులను వాటికి కట్టి అంగారక గ్రహం మీదకు పంపుతామని, అందుకోసం కేవలం 650 రూపాయలు కడితే సరిపోతుందని చెప్పారు. ఇక 'బయ్ నౌ' అనే బటన్ ఉండే ప్రదేశంలో.. 'డునాట్ బై' అనే బటన్ పెట్టారు. 2026 జూన్ 30వ తేదీన డెలివరీ ఇస్తామని చెప్పారు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Freedom 251, champone c1, 2016, Here are 2016 Famous Fake Brands. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X