ఇలాంటి వింతైన ఫోన్లు ఎప్పుడైనా చూశారా.. ఈ 6 ఆండ్రాయిడ్ మొబైల్స్ డిజైన్లు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
Android Phones: టెక్నాలజీ ఎంత వేగంగా మారుతుందో, ఫోన్ల డిజైన్లు కూడా అంతే ఫాస్ట్‌గా మారిపోతున్నాయి. ఇప్పుడంటే ఫోన్లు సన్నగా, స్టైలిష్ గా ఉంటున్నాయి కానీ ఒకప్పుడు మాత్రం కంపెనీలు జనాలని అట్రాక్ట్ చేయడానికి రకరకాల వింత డిజైన్లతో ఫోన్లు తయారు చేసేవాళ్లు. కొన్ని డిజైన్లు భలే కొత్తగా అనిపిస్తే, కొన్ని మాత్రం మరీ వింతగా ఉండేవి. అలాంటి ఆరు వింతైన ఆండ్రాయిడ్ ఫోన్ల గురించి ఇప్పుడు చూద్దాం.
* LG వింగ్ (2020) - తిరిగే స్క్రీన్ల మాయ
LG వింగ్ ఫోన్ అప్పట్లో ఒక సంచలనం. చూడటానికి నార్మల్ ఫోన్‌లానే ఉంటుంది కానీ, దీని స్క్రీన్‌ని తిప్పితే కింద ఇంకో చిన్న స్క్రీన్ బయటకి వచ్చేది. రెండు స్క్రీన్లు ఉండటం వల్ల ఒకేసారి రెండు పనులు చేసుకోవచ్చు అని కంపెనీ వాళ్లు చెప్పారు. ఇది చాలామంది దృష్టిని ఆకర్షించింది.

కానీ ఇది సైజులో పెద్దగా, వాడటానికి కాస్త కష్టంగా ఉండటంతో చాలా మందికి నచ్చలేదు. ఆ తర్వాత LG కంపెనీ ఫోన్లే చేయడం మానేసింది. దీంతో ఈ తిరిగే స్క్రీన్ల ఐడియా కూడా ఫ్లాప్ అయిపోయింది. మళ్లీ ఈ రొటేటింగ్ స్క్రీన్ ఫోన్లను తీసుకురావడానికి ఏ కంపెనీ కూడా ధైర్యం చేయలేదు.
* LG ఆప్టిమస్ 3D (2011) - 3D హడావిడి
అప్పట్లో 3D టెక్నాలజీ ట్రెండ్ నడిచింది గుర్తుంది. అప్పుడు LG కంపెనీ ఈ 3D టెక్నాలజీని ఫోన్లలోకి కూడా తీసుకొచ్చింది. LG ఆప్టిమస్ 3D ఫోన్ లో ఒక బటన్ ఉండేది. దాన్ని నొక్కితే ఫోన్ 2D మోడ్ నుండి 3D మోడ్ లోకి మారిపోయేది.
అంతేకాదు, 3D ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి డ్యూయల్ కెమెరాలు పెట్టారు. HTC కూడా ఈవో 3D అనే ఫోన్‌తో ఇలాగే ట్రై చేసింది. ఆపై 2018లో RED అనే కంపెనీ హైడ్రోజన్ వన్‌తో మళ్లీ 3D ఫోన్‌ని తీసుకొచ్చింది. కానీ 3D ఫీచర్ ఫోన్లలో పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇదొక గిమ్మిక్కులా మిగిలిపోయింది.
* మోటరోలా ఫ్లిప్ ఔట్ (2010) - చతురస్రాకారపు ఫోన్
మోటరోలా కంపెనీ ఆండ్రాయిడ్ స్టార్టింగ్ రోజుల్లో చాలా వెరైటీ డిజైన్లతో ఫోన్లు చేసింది. ఫ్లిప్ ఔట్ అలాంటి ఒక వింత ఫోన్. ఇది చూడటానికి చిన్న స్క్వేర్ బాక్స్ లా ఉండేది. దీనికి ఫిజికల్ కీబోర్డ్ కూడా ఉండేది. దాన్ని ఒక మూల నుండి తిప్పితే కీబోర్డ్ బయటకి వచ్చేది.
బ్లాక్ బెర్రీ ఫోన్ల స్టైల్‌ని మళ్లీ తీసుకొద్దామని ట్రై చేశారు. కానీ, ఈ ఫోన్ చూడటానికి వింతగా ఉండటంతో పాటు వాడటానికి కూడా అంత కంఫర్టబుల్‌గా లేదు. మోటరోలా ఇదే సంవత్సరం బ్యాక్‌ఫ్లిప్ అనే మరో వింత ఫోన్‌ని కూడా రిలీజ్ చేసింది. కానీ ఈ రెండు ఫోన్లు కూడా ఎక్కువ కాలం మార్కెట్లో నిలబడలేకపోయాయి.
* శామ్‌సంగ్ గెలాక్సీ రౌండ్ (2013) - సైడ్ కర్వ్డ్ స్క్రీన్
కర్వ్డ్ టీవీలు ట్రెండ్ అయినప్పుడు శామ్‌సంగ్, LG కంపెనీలు కర్వ్డ్ ఫోన్లను కూడా ట్రై చేశాయి. LG జీ ఫ్లెక్స్ ఫోన్ నిలువుగా వంపు తిరిగి ఉంటే, శామ్‌సంగ్ గెలాక్సీ రౌండ్ ఫోన్ అడ్డంగా వంపు తిరిగి ఉండేది. ఇది పట్టుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుందని శామ్‌సంగ్ చెప్పింది.
కానీ, నిజానికి దీని వల్ల పెద్దగా ఉపయోగం లేదని కస్టమర్లు తేల్చి చెప్పేశారు. చాలా త్వరగానే ఈ కర్వ్డ్ ఫోన్ల ట్రెండ్ కూడా కాలక్రమేణా మాయమైపోయింది. ఇప్పటికి కొన్ని కంపెనీలు వీటిని తీసుకొస్తున్నాయి కానీ అవి పెద్దగా హిట్ అవ్వడం లేదు.
* సోనీ ఎరిక్సన్ ఎక్స్‌పీరియా ప్లే (2011) - ప్లేస్టేషన్ ఫోన్
ఎక్స్‌పీరియా ప్లే ఫోన్‌ని గేమ్స్ ఆడేవాళ్ల కోసం డిజైన్ చేశారు. దీనికి స్లైడ్-ఔట్ కంట్రోలర్ ఉండేది. అంటే ఫోన్ కింద నుంచి కీప్యాడ్ లాంటిది బయటకి వస్తుంది. దానిలో డీ-ప్యాడ్, ప్లేస్టేషన్ బటన్స్, ట్రిగ్గర్స్ అన్నీ ఉండేవి. ఇవి వివిధ పనులకు ఉపయోగపడేవి.
మొబైల్‌లోనే కన్సోల్ గేమ్స్ ఆడిన ఫీలింగ్ రావాలని ట్రై చేశారు. కానీ అప్పట్లో మొబైల్ గేమ్స్ అంత అడ్వాన్స్డ్ గా లేకపోవడంతో ఈ గేమింగ్ ఫోన్ కాన్సెప్ట్ ఫెయిల్ అయింది. కానీ ఇప్పుడు మళ్లీ గేమింగ్ ఫోన్లు ట్రెండ్ అవుతున్నాయి. కానీ ఇలాంటి కంట్రోలర్లతో మాత్రం రావడం లేదు సపరేట్‌గా కంట్రోలర్లు ఉంటున్నాయి.
* నోకియా 9 ప్యూర్ వ్యూ (2019)
ఇప్పుడు చాలా ఫోన్లలో రెండు మూడు కెమెరాలు కామన్ అయిపోయాయి. కానీ నోకియా 9 ప్యూర్ వ్యూ ఫోన్ ఏకంగా ఐదు కెమెరాలతో వచ్చింది. ఒకేసారి ఐదు కెమెరాలు ఫొటోలు తీస్తాయి. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ ఆ ఫోటోలన్నిటినీ కలిపి ఒక సూపర్ డీటైల్డ్ ఫోటోని క్రియేట్ చేస్తుందని చెప్పారు.
థియరీ పరంగా ఇది చాలా బాగుంది కానీ, రియాలిటీలో మాత్రం అనుకున్నంతగా రిజల్ట్స్ రాలేదు. ఈ ఐడియా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ ఫోన్లు చూస్తే ప్రతి ఎక్స్‌పెరిమెంట్ సక్సెస్ అవ్వదని తెలుస్తుంది.


Click it and Unblock the Notifications








