ఊరించి ఊరించి చూపించింది!!

Posted By: Prashanth

ఊరించి ఊరించి చూపించింది!!

 

ప్రముఖ మొబైల్ ఫోన్‌ల తయారీ సంస్థ ఫుజిట్సు క్వాడ్‌కోర్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేస్తుందంటూ ఆ మధ్య వార్తలు వినిపించాయి. అనివార్య కారణల వల్ల ఈ ఫోన్ విడుదల ఆలస్యం కావటంతో ఫుజిట్సు చేసిన ప్రకటన ఉత్తిత్తేనని అందరూ భావించారు. కానీ ఒక్కాసారిగా అభిమానులకు ఫుజిట్సు షాక్ ఇచ్చింది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌గా ఫుజిట్సు ఈ స్మార్ట్ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఫుజిట్సు యారో కుటుంబం నుంచి కొత్త సభ్యనిగా వస్తున్న ఈ డివైజ్ ఫీచర్లు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

ఫుజిట్సు యారోస్ ఫోన్ ఫీచర్లు:

*    టెగ్రా 3 క్వాడ్ కోర్ ప్రాసెసర్,

* 4.6 అంగుళాల హై డెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్) ,

*   ఎల్‌టీఈ కనెక్టువిటీ,

*   13.1 మెగా పిక్సల్ కెమెరా విత్ 25600 ఐఎస్ వో సెన్సిటివిటీ,

*   డిఎల్ఎన్ఏ సపోర్ట్,

*   హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ,

*   గుగూల్ ఆండ్రాయిడ్ వర్షన్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం,

ఆధునిక ఫీచర్లను ఈ హ్యాండ్ సెట్ ఒదిగి ఉంది. పొందుపరిచిన శక్తివంతమైన టెగ్రా3 క్వాడ్ కోర్ ప్రాసెసర్ వివిధ ఫైళ్లతో పాటు అప్లికేషన్‌లను సజావుగా రన్ చేస్తుంది. ఏర్పాటు చేసిన 13.1 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థ ఉత్తమ క్వాలిటీ ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటుంది. నిక్షిప్తం చేసిన ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ వోఎస్ పూర్తి స్థాయి యూజర్ ఫ్రెండ్లీ స్వభావంతో స్పందిస్తుంది. అమెరికా, యూరప్ దేశాల్లో ఈ స్మార్ట్‌ఫోన్ లభ్యం కానుంది. ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting