జాతకాలు బయటపడే రోజు కోసం ఎదరుచూపులు మొదలు..?

By Prashanth
|
Fujitsu
కొన్ని నెలలుగా టెక్ ప్రపంచమంతా ఆ రోజు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుంది.. అంతిమంగా ఆ గడియలు సమీపించాయి.. ఏటా అట్టహాసంగా నిర్వహించే ‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో’కు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. సాంకేతికతకు, సృజతాత్మకతను జోడించి నిర్విరామంగా శ్రమించి రూపొందించబడిన 100ల సంఖ్యలో టెక్ గ్యాడ్జెట్లు ఈ వేదిక ద్వారా పరిచయం కానున్నాయి.

ప్రపంచపు మొట్టమొదటి విండోస్ ఫోన్‌ను లాంఛ్ చేసిన ‘ఫుజిట్సు’(Fujitsu) ఈ ప్రదర్శనలో తన బలాన్ని నిరూపించుకునేందుకు సమాయుత్తమవుతోంది. తాను డిజైన్ చేసిన సరికొత్త ‘హ్యాండ్ సెట్’ విశేషాలను ఈ ప్రదర్శనలో పరిచయం చేసుందుకు ఈ జపాన్ బ్రాండ్ ఉవ్విల్రూరుతుంది. ఆసియన్ మార్కెట్‌ను ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న ఫుజిట్సు ఇప్పటికే అద్భుతమైన మోడళ్లులో మొబైల్ ఫోన్‌లను ప్రవేశపెట్టింది.

శక్తివంతమైన క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో రన్ అయ్యే స్మార్ట్ ఫోన్‌ను ఫుజిట్సు ఈ ప్రదర్శనలో లాంఛ్ చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన ‘న్విడియా టెగ్రా 3 ప్రాసెసర్’ రెట్టింపైన సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. సాధారణ స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే ఈ డివైజ్ అత్యంత వేగవంతంగా స్పందిస్తుంది.

ఈ డివైజ్ హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ లేదా ఆండ్రాయిడ్ 4.0 వోఎస్‌ను ఈ డివైజ్‌లో లోడ్ చేసే అవకాశముంది. త్వరలో విడుదల కాబోతున్న ‘ఫుజిట్సు’ డ్యూయల్ కోర్, సింగిల్ కోర్ ఫోన్‌లకు గట్టి పోటీనిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X