ఈ మొబైల్ రాకతో మిగిలినవన్నీ ఫట్...

Posted By: Staff

ఈ మొబైల్ రాకతో మిగిలినవన్నీ ఫట్...

ప్రపంచ వ్యాప్తంగా ఐటి ప్రోడక్ట్స్, సర్వీస్ ప్రోవైడర్స్‌ని అందిస్తున్న ప్రమఖ కంపెనీ ఫుజిట్సు బిజినెస్ పరంగా ఎన్నో ఎత్తులను చూసినప్పటికీ మొబైల్ రంగం పట్ల ఉన్న మమకారంతో ఇందులో కూడా అత్యున్నత శిఖరాలకు చేరేందుకు గాను హై ఎండ్ మొబైల్ ఫోన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో యూజర్స్ ఆసక్తిని తమవైపుకి తిప్పుకొవాలంటే ప్రత్యేకమైన ఫీచర్స్‌తో వస్తేనే తప్ప, సాదాసీదా ఫీచర్స్‌తో వస్తే మాత్రం చాలా కష్టం అన్న విషయం అందరికి తెలిసిందే.

దీనిని దృష్టిలో పెట్టుకొని ఫుజిట్సు మొబైల్ మార్కెట్లోకి విడుదల చేయనున్న హై ఎండ్ స్మార్ట్ ఫోన్‌ని ఓ ప్రత్యేకమైన ఫీచర్‌తో విడుదల చేయనుంది. ఆ ప్రత్యేకమైన ఫీచర్ ఏంటని అనుకుంటున్నారా.. వాటర్ ప్రూఫ్. ప్రస్తుతం ఉన్న స్మార్ట్ ఫోన్స్ నీటిలో పడితే వాటిని ఇంక మొబైల్ షెడ్డుకి తరలించాల్సిందే. కానీ ఫుజిట్సు విడుదల చేయనున్న ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకంగా వాటర్ ఫ్రూఫ్‌‍ ఫీచర్ ఉండడం వల్ల నీటిలో పడినా కూడా మొబైల్‌కి ఎటువంటి ప్రమాదం జరగదని చెబుతున్నారు.

ఫుజిట్సు విడదల చేయనున్న ఆ స్మార్ట్ ఫోన్ పేరు ఫుజిట్సు Arrows Z ISW11F. ఈ స్మార్ట్ ఫోన్ చూసేందుకు చాలా అందంగా ఉండడం మాత్రమే కాకుండా, విడుదలకుండానే ఈ స్మార్ట్ పోన్‌కి మంచి గిరాకీ ఏర్పడింది. ఈ మొబైల్ తయారు చేయడానికి ఉపయోగించిన పింక్ కలర్ మగవారి కంటే కూడా ఆడవారిని ఇట్టే ఆకర్షణకు గురి చేస్తుంది. ఈ ప్రక్కనున్న చిత్రంలో మొబైల్ కలర్‌ని చూడొచ్చు.

ఇవి మాత్రమే కాకుండా యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీని స్క్రీన్ సైజు 4.3 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లేతో రూపొందించడం జరిగింది. ప్రస్తుతం విడుదలవుతున్న స్మార్ట్ ఫోన్స్‌ అన్నింటిని కూడా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో విడుదల చేస్తుండడంతో దీనిని కూడా ఆండ్రాయిడ్ వి2.3.5 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేవిధంగా రూపోందించడం జరిగింది.

ఫుజిట్సు Arrows Z ISW11F మొబైల్ ధర, ప్రత్యేకతలు:

* Android 2.3.5
* 4.3-inch LCD display with 1,280

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot