‘రాకురాకు’.. పెద్దలకు మాత్రమే?

Posted By: Super

‘రాకురాకు’.. పెద్దలకు మాత్రమే?

ప్రత్యేకించి పెద్ద వయస్కుల వారి కోసం అనేక మోడళ్లలో యూజర్ ఫ్రెండ్లీ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ విధమైన ఆలోచనతో తాజాగా ముందుకొచ్చిన సంస్థ ‘ఫుజిట్సు’(Fujitsu).ఈ బ్రాండ్ రాకురాకు (సౌకర్యం) లైనప్ నుంచి ‘ఎఫ్-12డి’ పేరుతో ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను వయసుమళ్లిన వారి కోసం డిజైన్ చేసింది. ఈ గ్యాడ్జెట్ ద్వారా సీనియర్ సిటిజెన్‌లు సౌకర్యవంతమైన కమ్యూనికేషన్ సంభాషణలను సాగించవచ్చు...

ఫోన్ కీలక ఫీచర్లు:

4 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్,

డిస్‌ప్లే ప్రమాదాలకు గురికాకుండా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్,

ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ MSM8255T చిప్‌సెట్,

1400మెగాహెట్జ్ క్లాక్ వేగాన్నికలిగిన ప్రాసెసింగ్ వ్యవస్థ,

1024ఎంబీ ర్యామ్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

సీఎమ్‌వోఎస్ సెన్సార్ కలిగిన 8 మెగా పిక్సల్ కెమెరా,

జీపీఆర్ఎస్ (క్లాస్ 12),

ఎడ్జ్ (క్లాస్ 12),

వై-ఫై v802.11b/g/n,

బ్లూటూత్ కనెక్టువిటీ,

మైక్రో యూఎస్బీ 2.0 కనెక్టువిటీ పోర్ట్,

1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

కస్టమైజిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్, పెద్దదైన టెక్స్ట్టింగ్, మెరుగైన టచ్‌స్ర్కీన్ సపోర్ట్ వంటి ప్రత్యేకతలు ఈ డివైజ్‌లో ఒదిగి ఉన్నాయి. అగష్టులో విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot