ఫుజిట్సు తోషిబా మొదటి విండోస్ ఫోన్ 7 IS12T

Posted By: Staff

ఫుజిట్సు తోషిబా మొదటి విండోస్ ఫోన్ 7 IS12T

మార్కెట్లోకి విండోస్ ఫోన్ 7 ఆధారిత మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేయడానికి ఎప్పటినుండో నోకియా, శ్యామ్ సంగ్, హెచ్‌టిసి, మోటరోలా కంపెనీలు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. పైన పేర్కోన్న కంపెనీలు ఇప్పటికే ఇండియన్ మొబైల్ మార్కెట్లో తమకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని ఏర్పరచుకున్నాయి. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో హావాని కొనసాగించడానికి కొత్త కంపెనీ ఫుజిట్సు తోషిబా మొట్టమొదటి సారి కమర్షియల్‌గా విండోస్ ఫోన్ 7ని మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఫుజిట్సు తోషిబా త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్న ఈ మొబైల్ పేరు IS12T.

మార్కెట్లో ఉన్న అన్ని స్మార్ట్ పోన్స్‌తో పోల్చినట్లైతే IS12T చాలా తక్కువ మందం కలిగి ఉంటే మొబైల్ పోన్. ఈ మొబైల్ ఫోన్ మందం కేవలం 10.6 mm మాత్రమే. ఈ మొబైల్‌కి ఉన్న మరో స్ఫెషాలిటీ ఏమిటంటే వాటర్ ప్రూప్. ఈ మొబైల్ వాటర్‌‌లో పడినప్పటికీ చెక్కుచెదరకుండా ఎప్పటిలాగే పనిచేస్తుంది. ప్రస్తుతానికి ఫుజిట్సు తోషిబా IS12T మొబైల్ ఒక్క జపాన్‌లోనే లభ్యమవుతున్నప్పటికీ త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొబైల్ ని తయారు చేసిన వారి మాటలను చూస్తుంటే ఇప్పటివరకు వచ్చినటువంటి హై ఎండ్ మొబైల్ ఫోన్స్ లలో ఇంత తక్కువ మందం కలిగిన, సెక్సీ లుక్ ఉండే ఫోన్ ఇంతవరకు మార్కెట్లో లేదని అంటున్నారు.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్ ఫోన్స్ మాదిరే యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని కలిగించేందుకు గాను దీనియొక్క స్క్రీన్ సైజు 3.7 ఇంచ్‌లుగా రూపొందించబడింది. ఇక మల్టీ టాస్కింగ్ పనులు చాలా వేగవంతంగా చేసేందుకు గాను ఇందులో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇమిడికృతం చేయడం జరిగింది. అంతేకాకుండా సింగిల్ Qualcomm MSM8655 ప్రాసెసర్‌, పవర్ పుల్ RAM మొమొరీ దీని సొంతం. 13.2 మెగా ఫిక్సల్ కెమెరాతో 1080p రిజల్యూషన్‌తో హై వీడియో రికార్డింగ్‌‌ని ఇది సపోర్ట్ చేస్తుంది.

ఈ మొబైల్‌కి సంబంధించిన కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ఆప్షన్స్‌ మొబైల్ తయారీదారులు వెల్లడించలేదు. ఏది ఏతేనేం పైన పేర్కోన్నటువంటి ఆఫ్షన్స్ బట్టి చూస్తుంటే ఫుజిట్సు తోషిబా IS12T మొబైల్ తప్పనిసరిగా హై ఎండ్ మొబైల్ కేటగిరిలోకి వెళుతుందని నిపుణులు అంచనా. సెప్టెంబర్ నెలలో జపాన్ మొబైల్ మార్కెట్లోకి ఫుజిట్సు తోషిబా IS12T దర్శనమివ్వనుంది. ప్రస్తుతానికి ఫుజిట్సు తోషిబా IS12T మొబైల్ ధరను ప్రకటించలేదు. త్వరలోనే మరిన్ని అప్ డేట్స్ కోసం చూడండి వన్ ఇండియా తెలుగు మొబైల్‌లో..........

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot