రూటు మార్చిన ‘ఫిలిప్స్’..?

By Super
|
Philips W626


ఆడియో ఉత్పత్తుల రంగంలో సంచలనాలు నమోదు చేసిన ‘ఫిలిప్స్’ రూటు మార్చింది. స్మార్ట్ ఫోన్ మార్కెట్ పై కన్నేసిన ఈ దిగ్గజ బ్రాండ్ ఆండ్రాయిడ్ ఆధారిత టచ్ స్ర్కీన్ ఫోన్‌ను రూపొందించింది. ‘ఫిలిప్స్ W626’గా డిజైన్ కాబడిన ఈ డివైజ్‌ను తాజాగా లాంఛ్ చేశారు.

 

ఫోన్ కీలక ఫీచర్లు:

* డ్యూయల్ సిమ్, * టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే, * ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, * 256 ఎంబీ ర్యామ్, * ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ 180 ఎంబీ, * జీపీఆర్ఎస్, ఎడ్జ్ వ్యవస్థలు, * వై-ఫై హాట్ స్పాట్, * బ్లూటూత్, * హెచ్టీఎమ్ఎల్ బ్రౌజర్, * మల్టీ మీడియా ప్లేయర్, * 3.15 మెగా పిక్సల్ కెమెరా, * ఆటో ఫోకస్, LED ఫ్లాష్, * 437 గంటల స్టాండ్‌బై టాక్‌టైమ్ నిచ్చే స్టాండర్ట్ లితియమ్ ఐయాన్ బ్యాటరీ.

 

ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేసిన 3జీ వ్యవస్థ కేవలం ఒక సిమ్‌కు మాత్రమే వర్తిస్తుంది. పొందుపరిచిన వై-ఫై కనెక్టువిటీ ఇంటర్నెట్ వేగాన్ని మరింత పెంచుతుంది. పోన్ బరువు కేవలం 102 గ్రాములు. , ప్రొఫెషనల్ లుక్‌తో కనిపించే ఈ స్మార్ట్ ఫోన్ మీ హుందాతనాన్ని రెట్టింపు చేస్తుంది. ఇండియన్ మార్కెట్లో ‘ఫిలిప్స్ W626’ ధర వివరాలు తెలయాల్సి ఉంది. అయితే సమంజసమైన ధరకే ఈ ఫోన్ లభించవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X